Viral Video: అందంగా ముస్తాబై వేదికపై కూర్చున్న వరుడు.. అత్త చేసిన పనికి దెబ్బకు షాక్.. ఏం జరిగిందంటే..

తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అందంగా ముస్తాబై కూర్చున్న వరుడికి అత్త షాకిచ్చింది.

Viral Video: అందంగా ముస్తాబై వేదికపై కూర్చున్న వరుడు.. అత్త చేసిన పనికి దెబ్బకు షాక్.. ఏం జరిగిందంటే..
Viral

Edited By:

Updated on: Aug 31, 2022 | 6:08 PM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వధూవరుల సరదా ఆటలు.. అలకలు.. బంధువులు, సన్నిహితుల అల్లరి ఇలా ఎన్నో వీడియోస్ నెట్టింట సందడి చేస్తుంటాయి. కొన్ని పెళ్లి వీడియోస్ సరదాగా అనిపించగా.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే కొన్నిసందర్భాల్లో పెళ్లి ఆచారాలు కాస్త విచిత్రంగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అందంగా ముస్తాబై కూర్చున్న వరుడికి అత్త షాకిచ్చింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా పడి పడి నవ్వేస్తారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకుందమా.

వీడియోలో వేదికపై వరుడు కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అత్త వేదికపైకి వచ్చి అతడి చెంపపై చిన్న కర్రతో తాకింది. ఇది చూస్తుంటే పెళ్లిలో వచ్చే ఆచారం అన్నట్లు కనిపిస్తోంది. అత్తతో పాటు మరో మహిళ సైతం అక్కడే ఉంది. అయితే ఆ ఇద్దరు మహిళలు తనతో ప్రవర్తిస్తున్న తీరు పట్ల వరుడు కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us