Viral Video: ఆఫీసులో ఏం తింటుందో షేర్ చేసిన గూగుల్ ఉద్యోగిని.. క్షణాల్లో వైరల్..

|

Aug 05, 2024 | 1:10 PM

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ సంస్థలో జాబ్ చేయాలని ప్రతీ ఐటీ ఉద్యోగుల కల. ఎందుకంటే గూగుల్ ఆఫీసులో ఉండే ఫెసిలిటీస్ మరే ఇతర ఉద్యోగాల్లో అంతలా ఉండవు. గూగుల్‌ సంస్థలో జాబ్ అంటే.. మామూలు విషయం కాదు. ఇక్కడ మీకు ఇష్టమైన ఫుడ్ తినవచ్చు. సమయానికి రెస్ట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఈ మధ్య తమ ఆఫీసుల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో..

Viral Video: ఆఫీసులో ఏం తింటుందో షేర్ చేసిన గూగుల్ ఉద్యోగిని.. క్షణాల్లో వైరల్..
Viral Video
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ సంస్థలో జాబ్ చేయాలని ప్రతీ ఐటీ ఉద్యోగుల కల. ఎందుకంటే గూగుల్ ఆఫీసులో ఉండే ఫెసిలిటీస్ మరే ఇతర ఉద్యోగాల్లో అంతలా ఉండవు. గూగుల్‌ సంస్థలో జాబ్ అంటే.. మామూలు విషయం కాదు. ఇక్కడ మీకు ఇష్టమైన ఫుడ్ తినవచ్చు. సమయానికి రెస్ట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఈ మధ్య తమ ఆఫీసుల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో.. గూగుల్ ఉద్యోగులు వీడియోలు షేర్ చేస్తూ ఉంటున్నారు. ఇవి క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటున్నాయి.

అలాంటి ఓ వీడియోనే మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గూగుల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని తన లంచ్ సమయంలో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో.. తాను ఏం తింటుందో వీడియో షూట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

తాజాగా గూగుల్‌లో పని చేసే ఓ మహిళ లంచ్ వీడియోను షేర్ చేసింది. ఇన్ స్టా‌లో వీడియో షేర్ చేస్తూ తాను ఆఫీసులో తీసుకునే ఆహార పదార్థాలతో కూడాని గ్లింప్స్‌ని కూడా పెట్టింది. డెస్క్ వద్ద మొదలైన ఈ వీడియో ఆఫీస్ క్యాంటీన్‌ వరకు వెళ్తుంది. క్యాంటీన్‌లో ఆమెకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ.. ఎక్స్ ప్లైన్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు ఆమె ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తాయి.

ఈ వీడియోలో మటన్ షీ కెబాబ్స్, పరాటా, గ్రీన్ చట్నీ, నూడుల్స్, సలాడ్ వంటివి సర్వ చేసుకోవడం కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.