Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మేకలు గడ్డి, పచ్చ ఆకులు, పశుగ్రాసం తింటాయి. కానీ ఈ వీడియోలో కనిపించిన మేక మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. మటన్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటూ కెమెరాకు చిక్కింది.

Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Goat Eating Mutton

Updated on: Jun 15, 2026 | 2:07 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మేకలు గడ్డి, పచ్చ ఆకులు, పశుగ్రాసం తింటాయి. కానీ ఈ వీడియోలో కనిపించిన మేక మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. మటన్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటూ కెమెరాకు చిక్కింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోను మేక యజమానే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేకకు గడ్డి, పచ్చని ఆకులపై ఆసక్తి చాలా తక్కువ. గత కొన్ని నెలలుగా చికెన్, మటన్ బిర్యానీ వంటి ఆహారాలనే ఎక్కువగా ఇష్టపడుతోందని చెబుతున్నాడు. ఇంట్లో బిర్యానీ వండిన ప్రతిసారీ అది పరుగెత్తుకుంటూ వచ్చి తన వంతు కోసం ఎదురుచూస్తుందని సరదాగా మేక యజమాని పేర్కొన్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. “ఇది మేకనా లేక సింహమా?”, “మేకే మటన్ తింటే ఇక మన పరిస్థితి ఏంటి?” అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రవర్తన చాలా అరుదుగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోపై పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు సహజంగా శాకాహార జంతువులని, వాటి జీర్ణవ్యవస్థ గడ్డి, ఆకులు వంటి ఆహారాన్ని జీర్ణం చేసుకునేలా రూపొందించినట్లు చెబుతున్నారు. మాంసాహార పదార్థాలను తరచూ తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, కడుపు నొప్పి, విరేచనాలు, కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో ఎంత వినోదాత్మకంగా ఉన్నప్పటికీ, జంతువులకు వాటి సహజ స్వభావానికి అనుగుణమైన ఆహారమే అందించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్ సాధిస్తూ వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us