Viral Video: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. ఈ ఒక్కసారికి క్షమించు బేబీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: సాధారణంగా ఏదైనా చిన్న తప్పు చేస్తే స్వారీ చెబుతారు. ఎందుకంటే అంతటితో ఆ సమస్య సమసిపోతుంది. కాదని పట్టుబడితే..

Viral Video: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. ఈ ఒక్కసారికి క్షమించు బేబీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Lover Begging

Updated on: Aug 26, 2022 | 4:23 PM

Viral Video: సాధారణంగా ఏదైనా చిన్న తప్పు చేస్తే స్వారీ చెబుతారు. ఎందుకంటే అంతటితో ఆ సమస్య సమసిపోతుంది. కాదని పట్టుబడితే.. అదికాస్తా ముదిరి.. పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తుంది. చాలా మంది పెద్దలు ఎప్పుడూ ఒకటి చెబుతుంటారు.. క్షమాగుణం అన్నింటికంటే ఉత్తమమైందని అన్నారు. అయితే, అన్నిసార్లూ క్షమాపణలను యాక్సెప్ట్ చేయడం కూడా వీలుపడదు. ఎందుకంటే.. తప్పులు మీద తప్పులు చేస్తూ దొరికిపోయిన ప్రతిసారీ క్షమించమంటే.. క్షమించలేరు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రేమికుల విషయానికి వస్తే ఇది కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు సారీలతోనే గడిచిపోతుంది. అలకలు, బుజ్జగింపులు, సారీలు ప్రేమలో కామన్. అయితే, కొన్నికొన్నిసార్లు అది సీరియస్‌కు దారితీస్తుంది. ఎంత బ్రతిమిలాడి సారీ చెప్పినా ఫలితం ఉండదు. తాజాగా లవర్స్‌కి సంబంధించి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..
ఓ యువకుడు ఓ అమ్మాయిని క్షమించండిన బ్రతిమాలుతుండి. ఆ అమ్మాయి ఎంతకూ వినకపోవడంతో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటున్నారు. అయినా వినకపోవడంతో కాళ్లు పట్టుకుని మరీ సారీ చెప్పాడు. పక్కనే అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతను అక్కడ నిల్చుని, పాపం ఈ ఒక్కసారికి క్షమించేయొచ్చుగా అని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి కనిరించలేదు. దాంతో అతను కాళ్లపై పడి బ్రతిమాలడం మొదలు పెట్టాడు. కాళ్లను బిగ్గర పట్టుకుని వేడుకున్నాడు. ఆ అమ్మాయి వదలరా బాబూ అంటూ ఇబ్బంది పడుతూ.. అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది. అబ్బాయి రిక్వెస్ట్‌కు ఓ వైపు నవ్వుకుంటూనే.. మరోవైపు మొండికేస్తోంది. అయితే, ఈ ఫన్నీ వీడియోను ఫన్ టాప్ అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..