Photo Puzzle: హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

కళ్లు పదునుపెట్టి.. మెదడుకు మేత వేసే పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. సాధారణంగా మీరు ఇప్పటివరకు పదజాలం చూసి ఉంటారు. అయితే ఇవి ఫోటో పజిల్స్.. మిమ్మల్ని ఓ ఆట ఆడేసుకుంటాయి. అవునండీ.! ఇది నిజమే.. ఇటీవల యువతను ఈ ఫోటో పజిల్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి.

Photo Puzzle: హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
Photo Puzzle 1
Follow us

|

Updated on: Apr 19, 2024 | 1:00 PM

కళ్లు పదునుపెట్టి.. మెదడుకు మేత వేసే పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. సాధారణంగా మీరు ఇప్పటివరకు పదజాలం చూసి ఉంటారు. అయితే ఇవి ఫోటో పజిల్స్.. మిమ్మల్ని ఓ ఆట ఆడేసుకుంటాయి. అవునండీ.! ఇది నిజమే.. ఇటీవల యువతను ఈ ఫోటో పజిల్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టేందుకు నెటిజన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీరు మీ ఐ ఫోకస్ దీనిపై పెడితే.. క్షణాల్లో కనిపెట్టొచ్చు. అలా వచ్చే ఆన్సర్ మీకు కిక్కే కిక్కు. ఈ ఫోటో పజిల్స్ కంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యేక పేజీలు  కూడా ఉన్నాయి. మరి తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోను తీక్షణంగా గమనించారా.? అందులో ఓ పక్షి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అక్కడున్న రాళ్ల రంగులో.. ఆ పక్షి రంగు ఉండటంతో.. దాన్ని కనిపెట్టడం మీకు అసాధ్యం. అయితే కొంచెం మీ కళ్లకు పని చెప్తే.. ఈజీ అయిపోవచ్చు. మరి లేట్ ఎందుకు ఓ ట్రయిల్ వేయండి మాస్టారూ.! కానీ ఒక్క మాట. ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీరు ఆ లిస్టులో చేరతారా.? లేక కనిపెడతారా.? చూద్దాం. కేవలం 10 సెకన్లలోపు ఆ పక్షిని కనిపెడితే.. మీరే కిలాడీలు.. అలా దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

Photo Puzzle