Watch Viral Video: ఇంజనీర్‌కు దండం సామీ..! 4 అడుగుల స్థలంలో మూడంతస్తుల భవనం..2 అడుగుల్లో కట్టిన ఇల్లు, దుకాణాలు.. వీడియో వైరల్‌

|

Nov 05, 2023 | 3:34 PM

నాలుగు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇల్లు అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 లక్షల 57 వేల మంది లైక్‌లు, 14.5 మిలియన్లు (1.5 కోట్లకు పైగా) వీక్షణలు వచ్చాయి. కాగా వందలాది మంది వినియోగదారులు వీడియోపై వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు భూకంపంలో ఈ ఇల్లు ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భవనం ఎవరు సృష్టించారంటూ మరి కొందరు ప్రశ్నించారు.

Watch Viral Video: ఇంజనీర్‌కు దండం సామీ..! 4 అడుగుల స్థలంలో మూడంతస్తుల భవనం..2 అడుగుల్లో కట్టిన ఇల్లు, దుకాణాలు.. వీడియో వైరల్‌
Skinny House
Follow us on

సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. స్థలం ఖరీదు, అందరికీ సరిపడ స్థలం లేకపోవటంతో పోటీ నెలకొంది. అలాంటి పరిస్థితిలో కొంతమంది చిన్న స్థలంలో కూడా అద్భుతమైన ఇంటిని నిర్మించుకుంటారు. ఇంత తక్కువ ఏరియాలో ఇంటి నిర్మాణం ఎంతబాగా చేశారు అనుకుంటూ చూపరులు కూడా ఆశ్చర్యపోతారు? అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాకై ముక్కున వెలేసుకుంటారు.. భూకంపం వంటిది వస్తే పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారు.

నగరాల్లో భూమి కోసం పోటీ చాలా ఉంది. అందుకే చాలా మంది ఫ్లాట్లలో సెటిల్ అవుతున్నారు. అయితే బహుళ అంతస్థుల భవనాల్లో ఫ్లాట్‌లు కొనడం అనేది అందరికీ నచ్చదు. అందుకే కొందరు చిన్న చిన్న స్థలాల్లో కూడా విలాసవంతమైన ఇళ్లు కట్టుకుంటున్నారు. అలాంటి రెండు ఇళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రజలు షాక్ అయ్యారు. అవును ఇంత తక్కువ స్థలంలో ఎవరైనా రెండు, మూడంతస్తుల ఇళ్లు ఎలా నిర్మిస్తారనుకుంటూ జనం నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ మొదటి ఇంటి నిర్మాణం కేవలం 4 అడుగుల స్థలంలోనే మూడు అంతస్తుల భవనం నిర్మించారు. రెండో ఇల్లు రెండంతస్తులు కాగా, రెండు అడుగుల స్థలంలోనే పలు దుకాణాలతో సహా నిర్మించారు. ఈ రెండు ఇళ్లను చూసిన నెటిజన్లు, స్థానికులు షాక్‌ అవుతున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ఈ ప్రత్యేకమైన ఇంటిని చూపిస్తూ ఒక వ్యక్తి చెబుతున్నాడు.. ఈ ఇంజనీర్ తెలివికి హాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటున్నాడు. అతను నాలుగు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి అందరినీ విస్తూ పోయేలా చేశాడు. ఇంత చిన్న స్థలంలో నిర్మించిన ఇంటి పైకి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి. బయట తలుపు కూడా ఉంది. ఈ వీడియోలో అలాంటిదే మరొక ఇల్లు కూడా కనిపించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక్కడ 2 అడుగుల విస్తీర్ణం నిర్మించిన భవనంలో పలు షాపులు కూడా ఉన్నాయి. దాని పైన రెండంతస్తుల ఇల్లు కూడా కట్టారని వీడియోలో వివరిస్తున్న వ్యక్తి చెబుతున్నాడు.

ఈ వీడియో Instagram హ్యాండిల్ @rk_khan_facts నుండి పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో ఇలా రాశాడు..నాలుగు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇల్లు అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 లక్షల 57 వేల మంది లైక్‌లు, 14.5 మిలియన్లు (1.5 కోట్లకు పైగా) వీక్షణలు వచ్చాయి. కాగా వందలాది మంది వినియోగదారులు వీడియోపై వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు భూకంపంలో ఈ ఇల్లు ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భవనం ఎవరు సృష్టించారంటూ మరి కొందరు ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..