Kedarnath: కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు.. సాహస వీడియో వైరల్‌

హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ప్రతి శివభక్తుడు కలలుకంటాడు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పవిత్ర ధామ్‌కు చేరుకోవడం అంత సులభం కాదు. కొండరాళ్లు, కఠినమైన వాతావరణం, నిటారైన కొండల మధ్య భక్తులు ఎంతో కష్టపడి కాలినడకన ప్రయాణిస్తుంటారు. అయితే, ఒక యువకుడు మాత్రం బాబా కేదార్‌నాథ్‌పై ఉన్న భక్తితో ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్త సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

Kedarnath: కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు.. సాహస వీడియో వైరల్‌
Kedarnath

Updated on: May 20, 2026 | 6:20 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు సంబంధించిన ఒక వినూత్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా భక్తులు ఇక్కడికి కాలినడకన, గుర్రాలు లేదా హెలికాప్టర్ల ద్వారా చేరుకుంటారు. కానీ, ఈ యువకుడు భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎటువంటి బైక్, కారు లేకుండా కేవలం రోలర్ స్కేట్స్ (Skating) ధరించి బాబా కేదార్‌నాథ్ దర్శనానికి బయలుదేరాడు. ఈ వినూత్న స్కేటింగ్ యాత్రకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెన్సేషన్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక యువకుడు తన వీపుపై ఒక పెద్ద బ్యాగ్ తగిలించుకుని, కాళ్లకు స్కేటింగ్ షూస్ ధరించి వేగంగా రోడ్డుపై దూసుకుపోవడం కనిపిస్తుంది. పర్వత ప్రాంతాలలోని ఎగుడుదిగుడు రోడ్లు, ప్రమాదకరమైన మలుపుల మధ్య కూడా అతను ఎంతో సమతుల్యతతో (Balance) స్కేటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. సాధారణంగా మైదాన ప్రాంతాలలోనే స్కేటింగ్ చేయడం కష్టం, అలాంటిది హిమాలయాల వంటి ఎత్తైన ఘాట్ రోడ్లపై స్కేటింగ్ చేస్తూ కొండలు ఎక్కడం నిజంగా ఒక అద్భుతమైన సాహసమనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వీక్షణలు (Views), వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ యువకుడి పట్టుదలను, బాబా కేదార్‌నాథ్ పట్ల అతనికి ఉన్న అపారమైన భక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హర హర మహాదేవ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

అయితే, కొందరు నెటిజన్లు పర్వత ప్రాంతాల రోడ్లపై ఇలా స్కేటింగ్ చేయడం చాలా ప్రమాదకరమని, ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి తగిన రక్షణ పరికరాలు ధరించాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, భక్తికి సాహసం తోడైతే ఎలా ఉంటుందో నిరూపిస్తున్న ఈ యువకుడి స్కేటింగ్ యాత్ర ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us