Viral Video: దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

|

Nov 18, 2021 | 9:00 AM

కొన్నినెలల క్రితం లక్నోలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓమహిళ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన సంగతి సంగతి తెలిసిందే...

Viral Video: దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Follow us on

కొన్నినెలల క్రితం లక్నోలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓమహిళ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన సంగతి సంగతి తెలిసిందే. మహిళ జీబ్రా క్రాసింగ్ దాటుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమె ముందు కారు ఆపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన యువతి క్యాబ్‌డ్రైవర్‌ను చెంపదెబ్బలు కొట్టింది. దీనిక సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. హారన్‌ కొట్టినా దారి ఇవ్వలేదని ఓ మహిళ క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. ఏకంగా రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి మరీ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. అతడి కాలర్ పట్టుకుని బూతులు తిడుతూ చెడామడా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాలర్‌ పట్టుకుని బూతులు తిడుతూ…
ఢిల్లీ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కస్తూరి లాల్‌ ఆనంద్‌ మార్గం కూడా ఒకటి. ఈ మార్గంలోనే ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. రోడ్డు అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. ఇంతలో మహిళ హారన్‌ కొట్టింది. కానీ స్కూటీ ముందున్న క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను పట్టించుకోలేదు. దీంతో మహిళ రెచ్చిపోయింది. స్కూటీని రోడ్డుమీదే పార్క్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతన్ని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ కాలర్‌ పట్టుకొని కొట్టింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా గట్టిగా అరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో సదరు మహిళ కోసం వేట ప్రారంభించారు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ఇస్తే ఆమెపై కేసు నమోదు చేసేందుకు రడీగా ఉన్నామని పోలీసులు తెలిపారు.

Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…

Frida Kahlo Painting: రూ. 260 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..

Guinness Record: ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌ గురూ..! ఈమె చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైరల్‌ వీడియో..