వార్నీ ఇదెక్కడి ఎడుపుగొట్టు క్లబ్‌! వేలాది మంది ఇక్కడకు ఏడ్చేందుకే వస్తారట.. అలా చేస్తే..

నేటి ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety) పెరిగిపోతున్నాయి. సమాజంలో ఏడవడం బలహీనతగా భావిస్తారు.. కాబట్టి చాలా మంది తమ బాధను లోపలే దాచుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా క్రై క్లబ్‌లు (Cry Clubs) వెలిశాయి. ఇక్కడికి వేలాది మంది ప్రజలు కేవలం ఏడవడానికి మాత్రమే వస్తారు. అయితే, ఇంతకీ ఈ క్రై క్లబ్‌లలో ఏం చేస్తారు..ఫీజులు, వగైరా వివరాల్లేంటో పూర్తి స్టోరీలో తెలుసుకుందాం..

వార్నీ ఇదెక్కడి ఎడుపుగొట్టు క్లబ్‌! వేలాది మంది ఇక్కడకు ఏడ్చేందుకే వస్తారట.. అలా చేస్తే..
Cry Club

Updated on: Jun 28, 2026 | 1:23 PM

ఈ ప్రపంచంలో నవ్వడం కోసం లాఫ్టర్ క్లబ్‌లు (Laughter Clubs) ఉండటం మనం చూశాం. కానీ, ఏడవడం కోసం కూడా ప్రత్యేకంగా క్లబ్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నప్పటికీ, నేటి ఆధునిక, యాంత్రిక జీవనశైలిలో ఇవి చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. నేడు మనుషులు ఆఫీస్ ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, పానిక్ అటాక్స్, డిప్రెషన్‌తో తీవ్రంగా సతమతమవుతున్నారు. సమాజం ఏడవడాన్ని ఒక బలహీనతగా చూస్తుందనే భయంతో చాలా మంది తమ బాధను, కన్నీళ్లను గుండెల్లోనే అణచివేసుకుంటారు. ఇలాంటి వారి మానసిక భారాన్ని తగ్గించడానికే జపాన్, యూరప్ వంటి దేశాల్లో క్రై క్లబ్ (Cry Club) లేదా రుయ్-కట్సు (Rui-katsu – అంటే కన్నీళ్ల అన్వేషణ) అనే వినూత్న భావన తెరపైకి వచ్చింది.

క్రై క్లబ్‌ లో ఏం జరుగుతుంది?:

ఈ క్రై క్లబ్‌ల వాతావరణం చాలా ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వ్యక్తులు ఎలాంటి మొహమాటం లేకుండా, ఎవరు ఏమనుకుంటారో అనే భయం లేకుండా మనసు విప్పి ఏడవచ్చు. ఈ క్లబ్‌లలో ప్రజలకు కన్నీళ్లు తెప్పించడానికి వీలుగా ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్స్, డిమ్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు. నిపుణుల పర్యవేక్షణలో అత్యంత విషాదకరమైన, గుండెను పిండేసే లఘు చిత్రాలు (Short films), ఎమోషనల్ వీడియోలు, ఆర్కెస్ట్రా సంగీతం, హృదయ విదారకమైన కథలను వీరికి చూపిస్తారు. వీటిని చూస్తూ అక్కడికి వచ్చిన వారంతా ఒకరినొకరు చూసుకోకుండా స్వేచ్ఛగా ఏడుస్తారు.

ఏడవడం వల్ల కలిగే శాస్త్రీయ ప్రయోజనాలు (Scientific Benefits of Crying):

శాస్త్రీయంగా చూసుకుంటే, ఏడవడం అనేది శరీరానికి ఒక రకమైన ఎమోషనల్ డీటాక్స్ (Emotional Detox). మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉండి ఏడ్చినప్పుడు, కన్నీళ్లతో పాటు శరీరంలో పేరుకుపోయిన కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు బయటకు వెళ్లిపోతాయి. ఏడ్చిన తర్వాత మెదడులో ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్ వంటి ఫీల్ గుడ్ కెమికల్స్ విడుదలై మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. రాత్రి పూట నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

సరిహద్దులు దాటి ప్రస్తుతం ఈ సరికొత్త ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. లోపల దాచుకున్న బాధ క్యాన్సర్ కంటే ప్రమాదకరమని, దాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు పంపడమే ఆరోగ్యానికి మంచిదని మానసిక నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. కాబట్టి, ఎప్పుడైనా మీకు మానసికంగా భారంగా అనిపిస్తే.. ఏడవడానికి అస్సలు సిగ్గుపడకండి, ఎందుకంటే నవ్వడం ఎంత ఆరోగ్యకరమో, ఏడవడం కూడా అంతే ముఖ్యం!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us