Viral Video: నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

Viral Video: అసలే వానాకాలం.. ఒక గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ జలమయమవుతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానని..

Viral Video: నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!
Viral Video

Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 4:36 PM

అసలే వానాకాలం.. ఒక గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ జలమయమవుతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! ఓ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్డంతా చెరువుని తలపించింది. ఏముందేలా కదా అనుకుని అక్కడున్న స్థానికులు దానిని దాటుతుండగా.. ఆ నీటిలో ఏదో పెద్ద ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. వారు కాస్త భయపడినా.. అది ఏంటా అని చూడగా ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఓ పెద్ద మొసలి ఆ నీటి నుంచి బయటకొచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని వదోదరాలో చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలను చూస్తుంటాం. ఇంటర్నెట్‌లో ఎక్కువగా వీక్షించే కంటెంట్ ఇదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి మొసలిని ఎంత చాకచక్యంగా పట్టుకుంటున్నాడో మీరు ఆ వీడియోలో చూడవచ్చు.

వర్షాలు భారీగా కురవడం వల్ల వదోదరాలోని ఓ రహదారి మొత్తం చెరువులా తలపిస్తోంది. ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ మొసలి వచ్చి.. ఆ నీటిలో ఒక పక్కన ఎంచక్కా సేద తీరుతోంది. ఈ విషయాన్ని అక్కడున్న స్థానికులు గమనించారు. అటుగా వెళ్తే ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుందని అనుకున్నారు. అంతే అనుకున్నదే తడువుగా అక్కడున్న మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా ఆ మొసలిని కర్రతో బెదిరిస్తూ.. వలకు చిక్కేలా చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఈ వీడియోను ‘Nature 27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ 48 సెకన్ల వీడియోను ఇప్పటిదాకా 41 వేలకు పైగా వీక్షకులు వీక్షించారు. వారందరూ కూడా లైకులు, కామెంట్స్‌తో హోరెత్తించారు. ఆ ఇద్దరు వ్యక్తుల ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!