Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి.. జంతువులు వేటాడే వీడియోలకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది.

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..
Cat

Updated on: Mar 04, 2022 | 8:14 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి.. జంతువులు వేటాడే వీడియోలకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. చాలా మంది అలాంటి వీడియోల కోసం గూగుల్ ని గాలించేస్తుంటారు. తమ ఆహారాన్ని వేటాడేందుకు జంతువులు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఒక జంతువు తన ఆహారాన్ని వేయడానికి చాలా ఓపికతో దాడి చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే. వేటాడేటప్పుడు జంతువులు ఎంత తెలివిగా , ఓపికగా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతలా ఈ వీడియోలో జంతువు దేనిని వేటాడిందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఇది ఒకటి. ఈ వీడియోలో ఓ పిల్లి ఒక పిచుకున్నాను వేటాడింది. అందులో ఏముంది అనుకుంటున్నారా.. ఒక పిచుకు నేలపై పడి ఉన్న గింజలను తినడానికి వచ్చింది అది గమనించిన ఓ పిల్లి దానిని ఎలాగైనా వేటాడాలనుకుంది.. ఏమాత్రం శబ్దం చేయకుండా.. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పిచుక వైపు కదిలింది. ఏమాత్రం ఆ పిచ్చుకకు అనుమానం రాకుండా చాలా ఓపికగా ఉండి చివరకు.. ఆ పిచుక ఆదమరిచిన క్షణంలో దానిపై దాడి చేసింది. రెప్ప మూసి తెరిచేలోగా ఆ పిచుక పైకి దూకి దాన్ని నోటికి కరుచుకుంది. ఈ వీడియో  ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈవీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us