Shocking Video: రెండస్థుల భవనాన్ని మింగేసిన సముద్రం.. రెప్పపాటులోనే జలసమాధి.. వైరల్ వీడియో

House falls collapses into Sea: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు.. వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు

Shocking Video: రెండస్థుల భవనాన్ని మింగేసిన సముద్రం.. రెప్పపాటులోనే జలసమాధి.. వైరల్ వీడియో
House Collapses Into Sea

Updated on: Jul 31, 2021 | 1:41 PM

House falls collapses into Sea: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు.. వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. అయితే.. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సముద్రం ఒడ్డున ఉన్న రెండస్థుల ఇల్లు ఒక్కసారిగా జలసమాధి అయింది. ఈ వీడియో చూస్తుంటేనే భయంకరంగా ఉంది. వాస్తవానికి ఇంటి లోపలున్న సీసీ కెమెరాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది. ఈ వీడియోలో.. సముద్రమట్టం పెరిగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. నీరు ఒడ్డుకు భారీగా చేరింది. బలమైన ఆటుపోట్ల వలన ఒడ్డునున్న ఇసుక, మట్టి మొత్తం కోతకు గురైంది. దీంతో రెండస్థుల భవనం పునాదులు బలహీనపడి.. సముద్రంలో ఒక్కసారిగా కుప్పకూలింది.

వైరల్ వీడియో..

Also Read:

Viral Video: ఇంత క్రూరత్వమా..! అడవి రాజైన నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా..!

Free Biryani: ఫ్రీ బిర్యానీ కోసం కక్కుర్తి.. పీకల్లోతు వివాదంలో ఆ ఐపీఎస్ అధికారిణి