Viral Video: వాటే స్మార్ట్ క్యాట్.. ఏకంగా భారీ చేపనే పట్టింది.. వైరలవుతున్న వీడియో..

|

Apr 08, 2022 | 4:37 PM

ఇలాంటి పిల్లి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ పిల్లి చాలా సింపుల్ టెక్నిక్‌తో పెద్ద చేపను పట్టేస్తుంది..

Viral Video: వాటే స్మార్ట్ క్యాట్.. ఏకంగా భారీ చేపనే పట్టింది.. వైరలవుతున్న వీడియో..
Cat Cleverly Preys And Catc
Follow us on

ఈ మధ్య సోషల్ మీడియాలో పెంపుడు జంతువుల వీడియో తెగ వైరల్(Viral Video) అవుతున్నాయి. పెంపుడు జంతువుల షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా చేతికి దక్కాలంటే దాని కోసం తపన పడాలి.. దానికోసం వేచి ఉండాలి.. అప్పుడు కాని మనం విజయం సాధించలేము. అయితే మన చుట్టూ ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి మన ఇంట్లో తిరిగే మార్జాలం ఓ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. అది టార్గెట్ చేసిందంటే వేట చిక్కేవరకు అక్కడ కూర్చుంటుంది. దానిని దక్కించుకుంటుంది. ఇలాంటి పిల్లి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలోని యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక పిల్లి చెరువు ఒడ్డున చేపలను వేటాడటం చూడవచ్చు. ఇళ్ళ చుట్టూ కనిపించే ఎలుకలు.. చిన్న జంతువులను వేటాడుతూ పిల్లులు కనిపిస్తాయి. పిల్లి వేటాడే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో పిల్లి తన వేటతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో చెరువు ఒడ్డున పిల్లి మెరుపుదాడి చేస్తూ కనిపించింది. ఈ సమయంలో పిల్లి అకస్మాత్తుగా నీటిలో పెద్ద చేపను టార్గెట్ చేస్తుంది. వేట సమయంలో పిల్లి పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తుంది. చిన్నపాటి కదలిక కూడా చేయదు.. దీని కారణంగా చేప నీటిపైకి వచ్చేవరకు అక్కడ వేచి చూస్తుంది. చేప నీటిపైకి వచ్చిన వెంటనే పట్టేస్తుంది. తన ముందు కాళ్లితో ఆ చేపను టచ్ చేస్తుంది.. దీంతో నీటిలో ఉన్న చేప భయంతో పైకి ఎగురుతుంది. చేప పైకి ఎగరడమే ఆలస్యం.. అంతే నోటితో పట్టేస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా షేర్ అవుతోంది. వార్తలు రాసే వరకు లక్షల్లో వ్యూస్‌తో పాటు వేలల్లో లైక్‌లు వస్తున్నాయి. పిల్లిని వేటాడే నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో చాలా మంది యూజర్లు పిల్లి టెక్నిక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..