Viral Pic: ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!

|

Jul 31, 2021 | 12:26 AM

'ఫైండ్ ది ఆబ్జెక్ట్' పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే...

Viral Pic: ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!
Tiger Pic
Follow us on

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో ఎన్ని పులులు దాగున్నాయో కనిపెట్టాలి. కొంచెం చూసేందుకు ఆ ఫోటో కాస్త గజిబిజిగా ఉన్నా.. అందులో ఉన్న పులుల సంఖ్య ఎంతో చెప్పాలి.

ఈ ఫోటోను మొదటిసారి చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ తీక్షణంగా చూస్తే అందులో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పవచ్చు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే.. కానీ మీ మెదడుకు  పదును పెడితే అది సాధ్యమవుతుంది. పైన ఉన్న ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కౌషల్ పటేల్ రాజస్థాన్‌లోని రంతంభోరి నేషనల్ పార్క్‌లో తీశారు.

ఈ ఫోటోను ‘sanctuaryasia’ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. అందులో పులులు ఎన్ని ఉన్నాయో కనుక్కునేందుకు తమ బుర్రలకు పని చెబుతున్నారు. సమాధానాలను కామెంట్స్‌ రూపంలో హోరెత్తిస్తున్నారు.

జవాబు: ఆ ఫోటోలో మూడు పులులు ఉన్నాయి.. 

Also Read: 

14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!

ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..