Viral Photo: కిర్రాక్ పజిల్.! ఇచ్చిపడేస్తది.. ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే ఇ’స్మార్ట్’!
కళ్లను మాయ చేస్తుంది. మీరు మేధావులైతే.. పప్పులో కాలేస్తారు. అంతటి కఠినమైన పజిల్.. ఇస్మార్ట్ శంకర్‌లకు దిమాక్ ఖరాబ్ చేస్తది.
ప్రజంట్ అంతా ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారు. ఇక నెట్టింట ప్రస్తుతం ఫోటో పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో మీకో అద్భుతమైన పజిల్‌తో మరోసారి మీ ముందుకు వచ్చేశాం. ఇది ఆషామాషీ పజిల్ కాదు.. మిమ్మల్ని తికమక పెట్టేస్తుంది. కళ్లను మాయ చేస్తుంది. మీరు మేధావులైతే.. పప్పులో కాలేస్తారు. అంతటి కఠినమైన పజిల్.. ఇస్మార్ట్ శంకర్‌లకు దిమాక్ ఖరాబ్ చేస్తది. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటో చూస్తే ఓ పర్వత ప్రాంతంలో తీసినట్లుగా అనిపిస్తుంది. చుట్టూ రాళ్లు.. వాటి రంగుతో పులుముకున్న ఆ ఫోటోలో ఓ చిరుత దాగుంది. అది తన ఎరను వేటాడి.. ఎంచక్కా తన స్థావరానికి వెళ్తోంది. దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.. ఈ పజిల్ సాల్వ్ చేయడంలో నూటికి 99 మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ట్రై చేయండి. నిశితంగా చూస్తే మీకు చిరుత దొరుకుతుంది. ఒకవేళ గుర్తించలేకపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.
here is the answer pic.twitter.com/D4JyRaCruQ
ఇవి కూడా చదవండి— telugufunworld (@telugufunworld) July 19, 2022