ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. దీనికోసం సోషల్ మీడియాలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడేవి కోకొల్లలు. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా ఒకటేమిటి సరదాగా సమయాన్ని గడపడానికి కావలసినన్ని ఉన్నాయి. ఈ కోవలో ఫోటో పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పజిల్స్‌ను సాల్వ్ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆరాటపడతారు. అవి మన మెదడుకు మేత వేయడంతో పాటు చురుకుదనాన్ని పెంచేందుకు సహాయపడతాయి. తాజాగా అలాంటి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. దాగుడుమూతలు ఆడుతోన్న ఆ పిల్లి తనను గుర్తించకుండా చెక్క గేటు వెనుక ఎక్కడో దాక్కుంది. అదెక్కడ ఉందో మీరు సరిగ్గా గుర్తించలేరు. కొంతమంది ఈ పజిల్‌ను చిటికెలో సాల్వ్ చేశారు. అయితే చాలామంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.