సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బిందాస్ పెళ్లికూతురు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేసిన పని వీక్షకులను భలేగా ఆకట్టుకుంది. చురుకైన పెళ్లి కూతురు ఉంటే..పెళ్లి కొడుక్కి చుక్కలే..అంటారు పెద్దలు..అన్నట్టుగానే ఇక్కడ ఓ నవ వధువు వరుడికి చుక్కలు చూపించింది. తినే పదార్థాన్ని నోటిదాక తెచ్చి నోటికి అందించకుండా..నోరూరించింది.
నిజంగానే ఈమె చలాకీ పెళ్లికూతురే..ఎందుకంటే…వరుడిని భలేగా ఆటపట్టిస్తోంది. వివాహ అనంతరం సరదాగా గడిపేందుకు వధువరులను భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడే వీరిద్దరూ పానీ పూరి తినేందుకు వెళ్లారు. అయితే, వధువు, వరుడికి పానీ పూరి అందించేందుకు ముందుకు వచ్చింది. అంతే ఆశగా వరుడు నోరుతెరిచి దగ్గరకు రాగానే ఆ పూరి కాస్త పెళ్లికూతురే గుటుక్కున మింగేసింది. పదేపదే ఇలాగే చేస్తూ..అతన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాపం పెళ్లికొడుకు బిక్కముఖం వేసుకోవాల్సి వచ్చిందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Also Read:
Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!