Viral Video: విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా

|

Jun 19, 2021 | 6:55 PM

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంచుకోదగ్గ మధురానుభూతి. కొందరు తమ పెళ్లిని పదికాలాల పాటు గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. కాస్త డబ్బు, పలుకుబడి...

Viral Video: విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా
Bride Crazy
Follow us on

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంచుకోదగ్గ మధురానుభూతి. కొందరు తమ పెళ్లిని పదికాలాల పాటు గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. కాస్త డబ్బు, పలుకుబడి ఉన్న వారైతే ఆకాశమంత పందిట్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అతిథులకు కళ్లు చెదిరే రీతిలో పదుల సంఖ్యలో రకరకాల వంటకాలు వడ్డిస్తారు. ఇక పెళ్లి వేడుకలో నవదంపతుల వింధు కార్యక్రమం చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి విందు కార్యక్రమంలో వధువు చేసిన అల్లరికి ఫిదా అయ్యాడు వరుడు. నైట్రోజన్‌ స్మోక్‌ ఐస్‌క్రీమ్‌ తిన్న వధువు ఫన్నీగా ఏం చేసిందో మీరే చూడండి.

నవ వధువు నోట్లో నైట్రోజన్‌ స్మోక్‌ ఐస్‌ క్రీమ్‌ను ఉంచాడు హోటల్‌ చెఫ్‌. దీంతో ఒక్కసారిగా నోట్లో, ముక్కులో నుంచి స్మోక్‌ బయటకు వచ్చింది. ఆ స్మోక్‌ను స్టైల్‌గా పెళ్లికొడుకు వైపు చూస్తూ, బయటకు వదులుతూ తెగ మురిసిపోయింది. ఇక వరుడు.. ఆమె చేస్తున్న ఆ చిలిపి పని చూస్తూ.. సంతోషపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.  నెటిజ‌న్లు ఈ క్యూట్ క‌పుల్‌కు బెస్ట్ విషెస్ అంద‌జేస్తున్నారు.

Also Read:  సో క్యూట్.. ప‌క్షుల‌తో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భ‌లే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 5,674 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా