పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలా మంది తమ పెళ్లి ఎలా జరగాలి.. ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలి అని విషయాలలో ఎన్నో కలలు కంటారు. మేళా తలాలు.. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక పెళ్లి తంతులో వధువు.. వరుడులతో బంధుమిత్రులు చేసే అల్లరి చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నా.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వధువు చేసిన పనికి వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. వరుడు పెళ్లికూతురిని స్వీట్లు తినమని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ మళ్లీ స్వీట్స్ తినాలని కోరాడు.. వధువు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా.. స్వీట్స్ తినమని బలవంతపెట్టాడు. దీంతో చిరాకొచ్చిన వధువు అతని కాలిని గట్టిగా గిల్లింది. దీంతో వరుడి భాధ మొత్తం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను bhutni_ke_memes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!