Bizarre Incident: గర్ల్‌ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు అతి తెలివి ప్రదర్శించిన ఇంజనీరింగ్ స్టూడెంట్‌.. చివరికి ఏమైదంటే

|

Feb 04, 2022 | 7:10 PM

Bizarre Incident: గర్ల్‌ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అయితే ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా తీసుకెళ్లేందుకు ఓ కన్నింగ్‌ ఆలోచన చేశాడా కుర్రాడు. గర్ల్‌ ఫ్రండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు...

Bizarre Incident: గర్ల్‌ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు అతి తెలివి ప్రదర్శించిన ఇంజనీరింగ్ స్టూడెంట్‌.. చివరికి ఏమైదంటే
Follow us on

Bizarre Incident: గర్ల్‌ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అయితే ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా తీసుకెళ్లేందుకు ఓ కన్నింగ్‌ ఆలోచన చేశాడా కుర్రాడు. గర్ల్‌ ఫ్రండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు ఏకంగా ఆమెను ట్రావెలింగ్‌ బ్యాగ్‌లో దాచేశాడు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ సంఘటన మణిపాల్‌లో మంగళవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మణిపాల్‌లో  ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి తన స్నేహితురాలిని హాస్టల్‌లోకి దొంగచాటుగా తీసుకెళ్లేందుకు ఆమెను ట్రావెలింగ్ బ్యాగ్‌లో దాచాడు. ఈ క్రమంలోనే హాస్టల్‌లోకి ఎంటర్‌ అయ్యే సమయంలో అక్కడే ఉన్న హాస్టల్‌ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. బ్యాగ్‌లో ఏముందని ప్రశ్నిచంగానే సదరు విద్యార్థి తడబడుతూ.. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని చెప్పాడు. వార్డెన్‌కు ఎందుకో విద్యార్థి తీరుపై అనుమానం కలిగింది. దీంతో వెంటనే బ్యాగ్‌ను ఓపెన్‌ చేసి చూపించమని అడిగాడు. అయితే వస్తువులు చాలా డెలికేటివ్‌వి అని, ఓపెన్‌ చేయడం కుదరదని చెప్పాడా కుర్రాడు.

దీంతో అనుమానం మరింత ఎక్కువైన వార్డెన్‌ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయాలని అనడంతో.. బ్యాగ్ తెరిచి చూసేసరికి అందులో అమ్మాయి కనిపించింది. బ్యాగ్‌లో అమ్మాయిని చూసిన వార్డెన్‌కు ఒక్కసారిగా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి అదే ఇంజనీరింగ్‌ కాలేజీలోనే విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన హాస్టల్‌ అధికారులు వెంటనే ఇందరినీ హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేశారని తెలుస్తోంది.

Also Read: Statue of Equality: అబ్బురపరిచే ఆలయ నిర్మాణ విశేషాలు.. వీడియో

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లను కేటాయించే అవకాశం..

UP ELECTIONS 2022: యుపీ ఎన్నికల ముఖచిత్రం అంతా సామాజివర్గాల సమ్మేళనం.. కులాల ప్రాతిపదికనే పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు