Brain Teaser: ఏంటీ మాయాజాలం.. ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే.. మీ చూపుల్లో పదునున్నట్లే..!

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. తాజాగా మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్ తీసుకొచ్చాం.

Brain Teaser: ఏంటీ మాయాజాలం.. ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే.. మీ చూపుల్లో పదునున్నట్లే..!
Spot The Hidden Bird

Updated on: May 01, 2022 | 6:22 PM

Viral Photo: నెట్టింట రకరకాల ఫన్ వీడియోలు, వైరల్ వీడియోలు చూసి ఎంజాయ్ చేసే వారు కొందరు ఉంటారు. కానీ కొందరు ఉంటారు… వారికి సవాళ్లు అంటే ఇష్టం. అందుకే వారి నెట్టింట సెర్చ్ చేసే కంటెంట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొందరి ఫోటో పజిల్స్(Photo Puzzles) అంటే భలే ఇష్టం. ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగి ఉన్నాయి’.. ‘ఈ ఫోటోలో  పాము దాగి ఉంది.. ఎక్కడో కనిపెట్టండి’ లాంటి పజిల్స్ నిత్యం వైరల్ అవుతున్నాయి. బెడ్ టైం రిలాక్సేషన్‌ను పొందడానికి ఫోటో పజిల్స్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి మీ మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పరీక్ష పెడతాయి. సదరు ఫోటోలో ఏముందో కనిపెట్టేవరకు కొంతమంది నిద్రపోరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఓసారి ఫోటోను చూసేయండి.. చూశారా.! పైన పేర్కొన్న ఫోటోలో ఓ పక్షి( grouse) దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అది అంత ఈజీ అయితే కాదు. పెద్ద.. పెద్ద బండరాళ్లు ఉన్న ప్రాంతంలో ఆ పక్షి ఉంది. ఇదొక చక్కటి బ్రెయిన్ టీజర్.. మీ ఐ పవర్ సూపర్‌గా ఉన్నట్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లేదంటే సరదా తీరిపోతుంది. చాలా తికమకగా ఉంటుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. కనిపెడితే మీ కళ్లకు పదునున్నట్లే. లేదంటే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..

 

Also Read: Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..? 

Loading...
Unable to load recommendations.
Follow Us