Viral Video: మీరేనా నేనూ ధరిస్తా మాస్క్.. ఈ వానరం ఏశాలు మామూలుగా లేవండోయ్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Viral Video: కోతి అంటేనే అల్లరి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. కనిపించిన వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉంటుంది.

Viral Video: మీరేనా నేనూ ధరిస్తా మాస్క్.. ఈ వానరం ఏశాలు మామూలుగా లేవండోయ్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Monkey

Updated on: Aug 25, 2021 | 9:03 PM

Viral Video: కోతి అంటేనే అల్లరి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. కనిపించిన వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉంటుంది. మనుషులను సైతం బెదిరించి దోపిడీకి పాల్పడుతుంది. ఇక కోతి చేష్టలు చాలా సార్లు తలనొప్పిగా మారినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ వానరం చేసిన పనితో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పెద్దలు చెప్పిన మాటలను బుద్ధిగా పాటిస్తున్నట్లుగా ఓ కోతి వ్యవహరించిన తీరు అందరినీ అబ్బురపరుస్తోంది. అందరికీ తానే ఆదర్శం అంటూ ముఖానికి మాస్కేసుకుని ఎంచక్కా చక్కర్లు కొడుతోంది.

అసలే కరోనా కాలం.. పైగా రోజుకో కొత్త వెరియెంట్ల రూపంలో వైరస్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అందుకే తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నట్టుంది ఈ కోతి. ఎవరో పారేసిన ఓ మాస్క్‌ పట్టుకుని ఇలా హంగామా చేసింది. ఏకంగా తన కళ్లు ముక్కు, నోరు చివరికి ముఖం కూడా కనబడకుండా మాస్క్‌ను చుట్టేసుకుంది. నరులకు సోకిన కరోనా.. వారి మధ్య తిరిగే వానరానికి సోకదా అన్నట్లు.. తాను మాత్రం ఎందుకు జాగ్రత్తలు తీసుకోకూడదు అనుకుందో ఏమో గానీ.. ఎంచక్కా మాస్క్ పెట్టుకుని రోడ్డుపై కాసేపు హడావుడి చేసింది.

కాగా, కోతి చేసిన పనిని గమనించిన కొందరు స్థానికులు.. తమ ఫోన్ కెమెరాకు పని చెప్పారు. కోతి కదలికలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇంకేముందు.. కోతి హల్‌చల్ చేసినట్లుగానే దాని వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు కోతిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలని, కరోనా కట్టడికి మాస్క్ తప్పనసరిగా ధరించాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Video:

Also read:

Rahul Murder: రాహుల్ హత్య కేసు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడించిన కోగంటి సత్యం..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

IND vs ENG: బౌన్సర్లతో భయపెట్టిన టీమిండియా బౌలర్.. తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి చూడలేదన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్

Loading...
Unable to load recommendations.
Follow Us