Viral Video: వారెవ్వా.. అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సైకిల్ తొక్కుతూనే ఎంత అందంగా డాన్స్ చేసింది.. ఆకట్టుకుంటున్న వీడియో..

|

Jan 05, 2023 | 1:43 PM

సైకిల్‌పై అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు కూడా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ అమ్మాయి డ్యాన్స్‌పై యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: వారెవ్వా.. అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సైకిల్ తొక్కుతూనే ఎంత అందంగా డాన్స్ చేసింది.. ఆకట్టుకుంటున్న వీడియో..
Bicycle
Follow us on

ప్రతి ఒక్కరూ సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేయడానికి ఇష్టపడతారు. అయితే ఎవరైనా వాహనం నడుపుతూ డ్యాన్స్‌ చేయటం చూశారా..? అవును ఇక్కడ సైకిల్ తొక్కుతూ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు . ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోలో, ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతూ డ్యాన్స్‌ చేస్తోంది. ఈ అమ్మాయి చోటే చోటే భయో కే బడే భయ్యా అనే పాటకు డ్యాన్స్ చేసింది. సైకిల్‌ తొక్కుతూ డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో ఆమె తన బ్యాలెన్స్‌ను కూడా కాపాడుకుంటుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె ముఖంలో హవభావాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సైకిల్‌పై నుంచి పడిపోతామనో, యాక్సిడెంట్ అవుతుందేమోనన్న భయమేమీ కనిపించదు. ఎంతో ఉత్సాహంగా, హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ సైకిల్‌ తొక్కుతున్న అమ్మాయిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

అమ్మాయి సైకిల్‌పై డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది లైక్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. సైకిల్‌పై అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు కూడా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ అమ్మాయి డ్యాన్స్‌పై యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఇలా ఎలా డ్యాన్స్ చేస్తారు అని ఓ యూజర్ రాశారు. మరొక వినియోగదారు ‘సూపర్’ అని వ్రాస్తాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…