Viral Video: సూపర్ మార్కెట్‌లో కలియదిరుగుతున్న బాతు.. సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తున్న వీడియో

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియోలను..

Viral Video: సూపర్ మార్కెట్‌లో కలియదిరుగుతున్న బాతు.. సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తున్న వీడియో
Duck Video

Updated on: Aug 18, 2021 | 7:59 AM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియోలను చూడగానే మనసుకు చాాలా రిలాక్స్ అనిపిస్తుంటుంది. ఒక పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే కోకొల్లలు అనే చెప్పాలి. క్యూట్, అందమైన జంతువులు, పక్షలు చేసే అల్లరి, చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు నిత్యం సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ బాతు చేసిన రచ్చ మామూలుగా లేదు. బాతు చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు.

సెడక్టివ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.  ‘‘అందమైన డక్ స్టోర్‌లోకి ప్రవేశించింది.’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ బాతులు స్టోర్‌లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన బాతు.. స్టోర్ అంతా కలియతిరిగింది. ఆ స్టోర్‌కు తానే రాజును అనే ఫీల్‌తో చుట్టూ జనాలు ఉన్నా పట్టించుకోకుండా హాయిగా తిరిగేసింది. ఆ సమయంలో బాతును వీడియోను తీసిన పలువురు.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనిని పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. 2 లక్షలకు లైక్స్ వచ్చాయి. అంతే స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. బాతు వీడియోపై తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఆసక్తికరమైన వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..

Crime News: వీడసలు మనిషేనా.. కట్టుకున్న భార్య నచ్చలేదని ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..