Viral News: ప్రేమ జంటను విడదీసిన హోటల్‌ వై-ఫై.. కట్‌ చేస్తే ప్రియుడికి దిమ్మతిరిగే షాక్‌..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విడాకుల కేసులు ఎక్కువయ్యాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజూ ఇలాంటి బ్రేకప్‌ వార్తలు అనేకం వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని వింత కేసులు కూడా ఉంటున్నాయి. కొన్ని సంబంధాలు చిన్న చిన్న సమస్యల వల్ల తెగిపోతుంటాయి. మరికొన్ని అపార్థాల వల్ల... కొన్నిసార్లు అనుమానం, అవతలి వ్యక్తిపై నమ్మకం లేకపోవడం వల్ల సంబంధాలు బలహీనపడతాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆధునిక సాంకేతికత ఉన్న ఈ యుగంలో ఇటువంటి కేసులు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇక్కడో జంట విడిపోయిన కథ చాలా విచిత్రంగా, వింతగా ఉంటుంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral News: ప్రేమ జంటను విడదీసిన హోటల్‌ వై-ఫై.. కట్‌ చేస్తే ప్రియుడికి దిమ్మతిరిగే షాక్‌..!
Hotel Wifi Auto Connect

Updated on: May 12, 2025 | 7:37 PM

జంటల మధ్య విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా జంటలు చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తుంటారు. అలాగే, కొందరు అనుమానాల కారణంగా కూడా విడిపోతుంటారు. చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఓ వింత విడాకుల సంఘటన వెలుగు చూసింది. హాలీ డే కోసం వెళ్లిన ఒక జంట వైఫై కారణంగా విడిపోయారు. ఆ అమ్మాయి హోటల్‌లోకి అడుగు పెట్టిన వెంటనే ఆమె మొబైల్ ఆటోమేటిక్‌గా హోటల్ వైఫైకి కనెక్ట్ అయింది. ఇది చూసిన ఆమె ప్రియుడు..ఆమెను అనుమానించాడు. నువ్వు ఇంతకు ముందు ఈ హోటల్‌కి వచ్చావు కదా అంటూ నిలదీశాడు.. ఎవరితో ఈ హోటల్‌కి వచ్చావంటూ అనుమానంగా ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆ యువతి చెప్పే మాటలు ఏ మాత్రం వినకుండా.. అతడు అక్కడికక్కడే ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు.

నివేదిక ప్రకారం, వారు మొదటిసారి కలిసి ఆ హోటల్‌కు వెళ్లారు. కానీ, అక్కడ తన ప్రియురాలి ఫోన్‌ ఆటోమెటిక్‌గా హోటల్‌ వైఫ్‌కి కనెక్ట్‌కావడంతో అతడు అనుమానం పెంచుకున్నాడు. ఆమె తనను మోసం చేస్తోందని ఆరోపించాడు. ఆ అమ్మాయి తాను నిర్దోషినని, ఇంతకు ముందు ఎప్పుడూ ఈ హోటల్‌కి రాలేదని చెప్పింది. కానీ, అతను నమ్మలేదు. ఈ హోటల్‌కి రావడం ఇదే మొదటిసారి అని చెప్పింది. కానీ తన ఫోన్ ఆటోమేటిక్ గా Wi-Fi కి ఎలా కనెక్ట్ అయిందో తెలియదు అంటూ వాపోయింది. కానీ, అతడు తనను నమ్మలేదు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.. దీంతో ఆ యువతి తనకు జరిగిన అన్యాయాన్ని తన స్నేహితులకు చెప్పుకుంది.. అంతటితో ఆగలేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి Wi-Fi కనెక్షన్ వెనుక గల కారణాన్ని బయటపెట్టేందుకు హోటల్ సిబ్బందిని ప్రశ్నించింది.

హోటల్‌ సిబ్బంది వివరణ మేరకు.. చాంగ్‌కింగ్‌లోని మరో హోటల్‌లో బాధిత యువతి పనిచేసింది. అదే హోటల్ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో Wi-Fiని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. దాంతో వెంటనే తన ప్రియుడికి పరిస్థితిని వివరించడానికి అతన్ని సంప్రదించింది. కానీ అతను ఆమెతో మాట్లాడటానికి నిరాకరించాడు. చాట్ యాప్‌లోని ఆమె ఖాతాను కూడా తొలగించాడు. కానీ, ఆ యువతి మాత్రం తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు గానూ స్థానిక వార్తా ఛానెల్‌ని సంప్రదించింది. జరిగిన విషయం అంతా వివరించింది. నిరూపించేందుకు ఒక రిపోర్టర్ ఆమె పనిచేసిన హోటల్‌కి వెళ్లాడు. అక్కడ ఆమె Wi-Fiకి కనెక్ట్ అయింది. ఆ తరువాత ఆమె, ఆమె ప్రియుడు వెళ్లిన హోటల్‌కు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రిపోర్టర్ ఫోన్ కూడా అదే విధంగా హోటల్ వై-ఫైకి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయింది. దాంతో ఆమె చెప్పింది నిజమేనని, ఆమె ఏ తప్పు చేయలేదని నిరూపించింది. ఈ సాంకేతిక తప్పిదం కారణంగా, ఆమెపై వేసిన ఆరోపణ నిరాధారమని తేలింది. కానీ, తనను నమ్మని వ్యక్తితో సంబంధాన్ని తిరిగి ప్రారంభించాలని తాను కోరుకోవడం లేదంటూ బాధిత యువతి తన ప్రియుడికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..