రెస్టారెంట్లు, వంటలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంటాయి. వీటిలో వేల మందికి బిర్యానీ, వందల కిలోల చికెన్ కర్రీ తయారు చేయటం వంటి వీడియోలు బాగా పాపులర్. అయితే, అలాంటిదే కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన రోటీ మేకింగ్ వీడియోని కూడా జనాలు లైక్ చేసారు. ఇందులో ఓ వ్యక్తి ఎలాంటి సహాయం లేకుండా తన చేతులతో 12 అడుగుల భారీ రోటీని తయారు చేశాడు.. ఎలాంటి కొత్త టెక్నాలజీ లేకుండా పాత పద్ధతిలో నిప్పులపై ఆ రోటీ బేక్ చేసి తయారు చేశాడు. సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ, అలాంటి సాంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వీడియో చూసిన చాలా మంది రాశారు.
అయితే, ఇలా చేతులపై రోటీని తయారుచేసే పద్ధతి చాలా సులభమైనదే. కానీ ఈ రోటీ పరిమాణం చాలా పెద్దది. ఈ వీడియోను ‘U క్రియేట్ జీ’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది. ఇది పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్‌గా తెలిసింది.
బన్నూ వివాహ వేడుకలో భాగంగా రూపొందించిన అతిపెద్ద ‘రుమాలి రోటీ’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది. నేలపై పరిచిన గుడ్డపై కూర్చుని, ఒక యువకుడు తన చేతులతో పిండిని కొడుతూ పెద్దదిగా చేశాడు. చివరగా, దానిని ఒకరి తలపై తిప్పినప్పుడు, రోటీ సుమారు 12 అడుగుల పొడవు అవుతుంది. అప్పుడు అతను దానిని సమీపంలో ఉంచిన ఐరన్ ప్యాన్ వేసి కాల్చాడు. దాని లోపల మంట మండుతోంది. ఆ తర్వాత అతను మరో రోటీ కోసం పిండిని చుట్టడం ప్రారంభిస్తాడు.
చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు. అయితే, కొందరు పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు కలిసి కూర్చుని ఇంత పెద్ద రోటీ తినడం గురించి మాట్లాడారు. మొత్తానికి వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.