డ్రైవర్ లేకుండానే తిరుగుతున్న ట్రాక్టర్ !

వరంగల్‌ రూరల్‌జిల్లా ఓగ్లాపూర్‌లో వింత సంఘటన జరిగింది. డ్రైవర్‌ ప్రమేయం లేకుండా ట్రాక్టర్‌ నాన్‌స్టాప్‌గా తిరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 3:05 pm, Sun, 13 September 20

వరంగల్‌ రూరల్‌జిల్లా ఓగ్లాపూర్‌లో వింత సంఘటన జరిగింది. డ్రైవర్‌ ప్రమేయం లేకుండా ట్రాక్టర్‌ నాన్‌స్టాప్‌గా తిరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఓగ్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ముందుటైర్‌ పంక్చర్‌ అయిన శబ్థం వచ్చింది. రైతు భయంతో ట్రాక్టర్‌ నుంచి కిందకు దూకేశాడు. అంతే ఒక్కసారిగా ట్రాక్టర్‌ పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. బంతి ఆకారంలో అతివేగంగా తిరగడం మొదలుపెట్టింది. ప్రజలు వింతగా చూస్తూ ఉండిపోయారు.

పంటపొలాలు, వాటిపక్కనే ఇళ్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ మాజీ సర్పంచ్‌ దేవులపల్లి విజయ్‌కుమార్‌ అటువైపుగా వచ్చారు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్‌ను కొద్దిసేపు గమనించాడు. ఆ వెంటనే ధైర్యం చేసి తిరుగుతున్న ట్రాక్టర్ వెంటపడి దానిపైకి ఎక్కి బ్రేక్‌ వేశాడు.

ట్రాక్టర్‌ ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ధైర్యంగా ట్రాక్టర్‌ను ఆపిన తీరును చూసి ప్రజలు మాజీ సర్పంచ్‌ను అభినందించారు.