తాటి చెట్టెక్కిన వినాయకుడు..! ఎందుకో మరీ..

toddy workers new idea ganesh statue at the top of the tree in yadadri, తాటి చెట్టెక్కిన వినాయకుడు..! ఎందుకో మరీ..
గణనాధుడు వెండికొండల్లో ఆడుకోవటం అందరికీ తెలుసు..కానీ, అదే వినాయకుడు తాటి చెట్లెక్కటం మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటి వినాయకుడు తాటి చెట్లు ఎందుకు ఎక్కుతున్నాడు..ఆయనకు అదేం అలవాటు అనుకుంటున్నారా..? అవును యాదాద్రి జిల్లాలో గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాధుడు..తాటి వనంలో తాటి చెట్లేక్కుతున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల్లో కొలువుదీరిన వినాయకులను మనం చూశాము..విభిన్న రీతుల్లో ఏర్పా టు చేసిన మండపాల్లో ఆ లంబోదరుడు భక్తులను ఆశ్వీరదించాడు. కానీ ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఆ విఘ్నేశ్వరుడు. గౌడన్నల కులవృతి గా ఉన్న కల్లు గీయడం దృష్టి లో ఉంచుకొని గంధమల్ల గ్రామానికి  చెందిన సుధాగాని కిరణ్  అనే యువకుడు తన సొంత ఖర్చు తో తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు గిస్తున్న వినాయకుడి విగ్రహన్నీ ప్రత్యేకంగా తయారు చేయించి.. వాహ్ అనిపించాడు. తాటి చెట్లు వాటి పైన ఉన్న కల్లు కుండలు,తాటి చెట్టు పైన గణపయ్య కల్లు చెట్టు పై నుండి తిస్తున్నటు గా ఈ విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది దీంతో పలు జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు, కల్లు గీత కార్మికులు ఈ వినాయకుడిని చూడటానికి భారీ గా తరలి వచ్చారు..సొంత ఖర్చుతో విగ్రహం తయారు చేయించిన సుధాగాని కిరణ్ గౌడ కులస్తుల, ప్రజల నుండి అభినందనలు తెలియజేసారు. గీత కార్మికులు తాటి చెట్టు పై నుండి ప్రమాదవ శాతు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి విఘ్ననాధున్నివేడుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *