Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1076 కొత్త పాజిటివ్ కేసులు,11 మంది మృతి. ఢిల్లీవ్యాప్తంగా 140232 కేసులు నమోదు. 10072 యాక్టీవ్ కేస్ లు. 126116 మంది డిశ్చార్జ్. మొత్తం 4044 మంది మృతి
  • రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కృష్ణ నీటి పంపకాలు చేపట్టిన కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటాగా 37.672 టీఎంసీలు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా 17 టీఎంసీలు.
  • ఆహా OTT లో సరికొత్త షో మెట్రో కధలు. ఈనెల 14 నుండి ప్రారంభం. 4 కధలను చెబుతున్న డైరెక్టర్ కరుణ కుమార్. గతంలో పలాస సినిమా డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ . మెట్రో కధలు పోస్టర్ లాంచ్ చేసి యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పిన హరీష్ శంకర్. సాహిత్యానికి సినిమా కి దగ్గర సంభందం ఉందన్న దర్శకుడు కరుణ కుమార్.
  • విజయవాడ: బీజేపీ నుండి మరో నేత సస్పెండ్. పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడుతున్న వారిని వరసగా సస్పెండ్ చేస్తున్న బిజెపి. ఇప్పటికే పలువురు నేతలు సస్పెండ్.. మరి కొంత మందికి నోటీసులు ఇచ్చిన ఏపీ బీజేపీ. లేటెస్ట్ గా మరొకరు తిరుపతి కి చెందిన ఓ వి రమణ సస్పెండ్. మూడు ముక్కలాట లో నష్టపోతున్న బీజేపీ అని ఒక దిన పత్రికలో ఆర్టికల్ రాసిన తిరుపతి కి చెందిన బీజేపీ నేత ఓ వి రమణ .
  • అమరావతి: ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. ఆక్వా అభివృద్ధి, ఆక్వా కల్చర్ మానిటర్, ప్రమోట్, రెగ్యులేషన్ లక్ష్యాలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం.

వైఎస్ఆర్ జ‌యంతి.. నేడు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ఇవే..

నేడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో ప్ర‌ధానంగా త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్..
Today EX CM YS Rajasekhara Reddy 71 birth anniversary, వైఎస్ఆర్ జ‌యంతి.. నేడు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ఇవే..

నేడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో ప్ర‌ధానంగా త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిన్న సాయంత్ర‌మే ఇడుపుల‌పాయ‌కు వెళ్లారు. ఇవాళ ఉద‌య‌మే 8.10 గంట‌ల‌కు త‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి వైఎస్సార్ ఘాట్ ద‌గ్గ‌ర నివాళులు అర్పిస్తారు. ఆ త‌ర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.

నేటి కార్యక్రమాల లిస్ట్:

– ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంప‌స్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌
– ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీలో రూ.10.10 కోట్ల‌తో ఏర్పాటు చేసిన కంప్యూట‌ర్ సెంట‌ర్ కు శంకుస్థాప‌న‌
– అలాగే వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ రాసిన నాలో నాతో పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌
– పేద విద్యార్థుల‌కు టెక్నాల‌జీ విద్య‌ను అందించేందుకు ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల‌తో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ త‌ర‌గ‌తి భ‌వ‌నాల ప్రారంభం
– ఇడుపులపాయ నెమ‌ళ్ల పార్టు ప‌క్క‌న మూడు మెగావాట్ల సామ‌ర్ధ్యంతో రెస్కో కోల‌బ్రేష‌న్ సిస్ట‌మ్ తో సోలార్ విద్యుత్ ప్లాంట్ కి సంబంధించిన శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌
– ఇక వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా గుంటూరు తాడేప‌ల్లిలోని వైసీపీ ఆఫీసులో ఉద‌యం 9.15 గంట‌ల‌కు నివాళులు అర్పిస్తారు.

Related Tags