మమతా బెనర్జీకి భారీ షాక్, కేబినెట్ నుంచి వైదొలిగిన సువేందు, కమళ దళం వైపు చూపు !

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో బెంగాల్‌లోని అధికార టీఎంసీ ఊహించని షాక్ తగిలింది. సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడిగా పేరున్న కీలక నేత సువేందు అధికారి..

  • Ram Naramaneni
  • Publish Date - 4:42 pm, Fri, 27 November 20

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో బెంగాల్‌లోని అధికార టీఎంసీ ఊహించని షాక్ తగిలింది. సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడిగా పేరున్న కీలక నేత సువేందు అధికారి..మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను మమతకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. గవర్నర్‌కు కూడా రాజీనామా విషయాన్ని మెయిల్ ద్వారా తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. బెంగాల్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్న సువేందు.. హుగ్లీ రివర్ బ్రిడ్జ్​ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి బుధవారమే వైదొలిగారు. సువెందు గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం కేబినెట్ మీటింగ్స్‌లో కనిపించడం లేదు. సువేందు మమతా తీరుపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన బీజేపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది.

పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీఎంసీ మరో సీనియర్​ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి..బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాషాయ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ ఎంపీ నిసిత్​ ప్రమాణిక్​తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

Also Read :

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు

నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్, ముద్దుగుమ్మలకు భలే దారి చూపించింది