TTD: ఏపీ నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ వార్తలను నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

Tirumala Tirupati Devasthanam: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే...

TTD: ఏపీ నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ వార్తలను నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 6:39 PM

Tirumala Tirupati Devasthanam: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా టీటీడీ ఉద్యోగాల భర్తీ పేరుతో ఓ పుకారు నెట్టింట్లో వైరల్ అయింది.

టీటీడీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొంతమంది కేటగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ఫేక్ ప్రచారాన్ని చేశారు. దీనిపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పందించింది. ఏపీలోని నిరుద్యోగులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ నెట్టింట్లో పోస్టులు హాల్‌చల్ చేస్తున్నాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ఉద్యోగుల భర్తీ విషయంలో టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అవాస్తవ ప్రచారాలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని టీటీడీ సూచనలు ఇచ్చింది.