కమలాపురం త్యాగరాజేశ్వరుడు… ఆసియాలోనే పెద్ద రథం

తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి. పురాణ గాథలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ‘షణ్ముఖ వైభవం’ ప్రవచనంలో […]

కమలాపురం త్యాగరాజేశ్వరుడు... ఆసియాలోనే పెద్ద రథం
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 11:27 AM

తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి.

పురాణ గాథలు

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ‘షణ్ముఖ వైభవం’ ప్రవచనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించడం జరిగింది. పురాణ గాథాల ప్రకారం ఒక సారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట. అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తిని కావాలని కోరుతాడు.

సోమాస్కంద మూర్తి

సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహాన్ని ముచికుందుడుకు ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారుచేయిస్తాడు. అయితే ముచికుంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమాస్కంద మూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు. అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్ లో ప్రతిష్టించాడు. ఈ మూర్తినే వీధి విడంగర్ అని పిలుస్తుంటారు.

సప్తవిడంగ స్థలములు

సప్తవిడంగ స్థలములుగా పిలిచే మిగిలిన ఆరు తిరునల్లార్ లోని నాగర్ విడంగర్, నాగపట్టణంలో సుందర విడంగర్, తిరుకువలమైలో అవని విడంగర్, తిరువాయిమూర్ లో నీల విడంగర్, వేదారణ్యంలో భువని విడంగర్, తిరుకరవసల్ లో ఆది విడంగర్ పేరుతో త్యాగరాజ స్వామి ఈ ఏడు ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం క్రీశ 7 వ శతాబ్ద౦లోని శైవ నాయన్మార్ల తేవర శ్లోకాల ద్వారా ప్రసిద్ధిచెందింది.

వాల్మికినాథర్ మందిరం

తిరువారూర్ లోని ఈ ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు, ఒకటి వాల్మీకినాథర్ రూపంలో పూజించబడే శివుడు, మరొకటి త్యాగరాజ విగ్రహం. వాల్మికినాథర్ మందిరం త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దదిగా ఉంటుంది.

శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు

శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు, ఎనభూ విమానములు, పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పూలతోటలు, మూడు పెద్ద ప్రాకారాలు, వెయ్యికి పైగా ఉపాలయాలతో ఆ ఆలయం ఎంతో విశాల ప్రాంగణంలో కొలువుదీరి ఉంది. సాధారణంగా శివాలయాలలో ఉండే విధంగా చండికేశ్వరునితో పాటు యముడు తనకు ఇక్కడ ఏమీ పని లేదని చెప్పడంతో ఆయనను చండికేశ్వరుని స్థానంలో ఉండమనడంతో యమ చండికేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు.

కమలాంబికా అమ్మవారు

ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబికా అమ్మవారు కాలుపై కాలు వేసుకుని ఠీవిగా కూర్చొని ఉంటడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి మరెక్కడా కనబడరు. ఈ స్థితిలో కూర్చుని అమ్మవారు శివుని ధ్యానిస్తూ ఉంటారని, కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు.

వాల్మీకనాథుడుగా శివుడు

వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలసిన స్వామి అని దేవతల ప్రార్థననుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు. అనంతీశ్వరుడు, నీలోత్పలాంబ, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు, అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు.

త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి. చారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ రథం. దీనిని రూ.2.17 కోట్ల వ్యయంతో రూపొందించించారు. ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది. సాక్షాత్తుగా దేవేంద్రుడే ఆ సమయంలో ఇక్కడకు వచ్చి స్వామిని పూజిస్తాడని, మొత్తం దేవగణమంతా అందులో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఎలా వెళ్ళాలి

చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణానికి చాల బస్సుల ఉంటాయి. అక్కడినుండి గంట ప్రయాణం చేస్తే కమలాపురం చేరుకోవచ్చు.