అసలు ఇంగ్లాండ్ ఎలా విజేత..? వివరించిన వెన్నెల కిషోర్

రెండు సార్లు టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఇదో కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లు టై అవ్వలేదు. ఏదో ఒక జట్టు గెలుస్తూ వచ్చింది. అయితే, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించన ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 […]

అసలు ఇంగ్లాండ్ ఎలా విజేత..? వివరించిన వెన్నెల కిషోర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2019 | 9:26 AM

రెండు సార్లు టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఇదో కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లు టై అవ్వలేదు. ఏదో ఒక జట్టు గెలుస్తూ వచ్చింది. అయితే, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించన ఘటన జరిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది.

అయితే ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులకు అసలు విషయం ఎంటో అర్ధం కలేదు. రెండు సార్లు రెండు జట్లు సేమ్ స్కోర్ చేశాయి. మ్యాచ్ టై అవ్వాలి కదా.. అనుకున్నారు. ఇద్దరినీ కలిపి విజేతగా ప్రకటిస్తారని ఆశించారు. కానీ ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చేలా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించింది. అయితే ఎలా ప్రకటించిందో మన తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్.. తన ట్విట్టర్‌లో తెలిపాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు.