YS Sharmila: టీఆర్ఎస్ నేతలతో ప్రాణహానీ.. సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల..

|

Dec 04, 2022 | 5:28 PM

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే..

YS Sharmila: టీఆర్ఎస్ నేతలతో ప్రాణహానీ.. సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల..
Ys Sharmila
Follow us on

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక మహిళా పాదయాత్ర చేసి ఎమ్మెల్యేల అవినీతిని ఎత్తిచూపుతుంటే జీర్ణం కాక తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు అవినీతి చేయకపోతే ప్రజాఫోరం ఏర్పాటు చేసి మీనిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సవాల్ విసిరారు వైఎస్ షర్మిళ.

పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి తన పాదయాత్రను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు షర్మిళ. ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభం కావాల్సిన పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేయడంపై షర్మిళ తీవ్రంగా మండిపడ్డారు. నర్శంపేటలో తనపై దాడి చేసింది టీఆర్ఎస్ గూండాలనేననిన ఆరోపించిన ఆమె.. చేసిందంతా వాళ్లు చేసి శాంతి భద్రతలకు తాము విఘాతం సృష్టిస్తున్నామని ఎలా అంటారని ప్రశ్నించారు.

తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చెయ్యడం లేదని, తనపై టీఆర్ఎస్ నేతలే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని షర్మిళ ఆరోపించారు. ప్రతి నిజయోక వర్గంలోనూ అవినీతి జరుగుతోందని.. కావాలంటే పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేసిన చర్చించేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉండగా.. ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కావాల్సిన షర్మిళ పాదయాత్ర పోలీసుల షోకాజ్ నోటీసుతో వాయిదా పడింది. ఎవ్వరైనా హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని శాంతి భద్రతలను ఫణంగా పెడితే ఎవ్వరినైనా సహించేది లేదని వరంగల్ సీపీ ఎ.వి. రంగనాథ్ అన్నారు. పోలీసులు షోకాజ్ నోటీసుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు వైఎస్ఆర్‌టీపీ నేతలు. ప్రస్తుత పరిస్థితుల్లో సోమవారం పాదయాత్ర తిరిగి ప్రారంభం కాకపోవచ్చని షర్మిళ స్పష్టం చేశారు.

పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే అడ్డుకుంటారు..

ఇక షర్మిళ పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిళకు సవాళ్లు విసురుతూ లేఖలు రాస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలోనే 9 ప్రశ్నలతో కూడిన లేఖను విడుదల చేశారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆమె పాదయాత్ర సాగుతుందా? ఆగుతుందా? అనేది ఆమె నాలుక తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కచ్చితంగా ప్రజలు అడ్డుకుంటారని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత షర్మిలదే అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. షర్మిళ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..