భారతీయుడు2 సినిమా చూస్తూ.. అచ్చం అదే స్టైల్‌లో మర్డర్ స్కెచ్.. బిత్తరపోయిన ప్రేక్షకులు..!

సినిమా ధియేటర్లో కత్తిపోట్లు పొడిచిన సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. భారతీయుడు.2 సినిమా చూస్తూ అచ్చం ఆ సినిమాలో సీన్ తరహాలోనే ఓ యువకుడిని అదే తరహాలో పొడిచేశారు. ప్రాణాపాస్థితిలో ఉన్న యువకుడిని ప్రేక్షకులు ఆస్పత్రికి తరలించారు. పాత కక్ష తీర్చుకోవడానికి భారతీయుడు 2 సినిమాను మర్డర్ స్పాట్‌గా ఎంచుకోవడం సంచలనంగా మారింది.

భారతీయుడు2 సినిమా చూస్తూ.. అచ్చం అదే స్టైల్‌లో మర్డర్ స్కెచ్.. బిత్తరపోయిన ప్రేక్షకులు..!
Young Man Stabbed
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 12, 2024 | 8:29 PM

సినిమా ధియేటర్లో కత్తిపోట్లు పొడిచిన సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. భారతీయుడు.2 సినిమా చూస్తూ అచ్చం ఆ సినిమాలో సీన్ తరహాలోనే ఓ యువకుడిని అదే తరహాలో పొడిచేశారు. ప్రాణాపాస్థితిలో ఉన్న యువకుడిని ప్రేక్షకులు ఆస్పత్రికి తరలించారు. పాత కక్ష తీర్చుకోవడానికి భారతీయుడు 2 సినిమాను మర్డర్ స్పాట్‌గా ఎంచుకోవడం సంచలనంగా మారింది.

ఈ దారుణ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో జరిగింది. మధ్యాహ్నం భారతీయుడు 2 సినిమా చూస్తుండగా కత్తిపోట్లు కలకలం రేపాయి. విజయ్ అనే యువకుడిపై కృష్ణ అనే మరో యువకుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. అచ్చం కమలహాసన్ స్టైల్ లోనే కృష్ణ కత్తితో మెరుపు దాడి చేశాడు. విజయ్ తన స్నేహితులతో కలిసి భారతీయుడు 2 సినిమా చూస్తూ ఆ సినిమాలోకంలో మునిగిపోయాడు. ఈ క్రమంలో కత్తితో విరుచుకుపడిన కృష్ణ అతన్ని విచక్షణారహితంగా పొడిచి కసి తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.

కత్తిపోట్లకు గురైన విజయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కత్తితో పొడిచిన కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దాడికి పాల్పడిన కృష్ణ స్వస్థలం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం కాగా, కత్తిపోట్లకు గురైన విజయ్ తొర్రూర్ మండలం అమ్మపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉండట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.