Rain Alert: కూల్ న్యూస్.. తెలంగాణలో వచ్చే వారం రోజులూ వానలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఆకాశం నుంచి ఆగకుండా వడగండ్లు కుస్తున్నాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా...మరి కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.

Rain Alert: కూల్ న్యూస్.. తెలంగాణలో వచ్చే వారం రోజులూ వానలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather

Updated on: Mar 29, 2023 | 6:06 PM

మార్చి పోతుంది ఏప్రిల్ వస్తుంది.. ఎండలు దంచికొడతాయ్ అని భయపడుతున్నారా..? అయితే మీ కోసమే ఈ కూల్ న్యూస్. వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మధ్యప్రదేశ్‌లోని మధ్య ప్రాంతాల నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.  కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ముఖ్యంగా మహబూబాబాద్, జనగాం, వరంగల్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.

అటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే చాన్స్ ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చెట్ల కింద అస్సలు నిల్చోవద్దని హెచ్చరించారు. అకాల వర్షాలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు వెదర్ బులెటిన్‌ షాక్‌కు గురిచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

 

Follow Us