Weather Report: తీరం దాటిన తుఫాన్.. ఈ రోజులు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

AP and Telangana Rains Alert: తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది, మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.

Weather Report: తీరం దాటిన తుఫాన్.. ఈ రోజులు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap, Telangana Latest Weather Update

Updated on: Nov 04, 2026 | 7:12 AM

ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించగా.. బంగాళాఖాతంలోని వాతావరణ మార్పుల కారణంగా ఈ రోజు కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాకరం.. ఎన్టీఆర్‌ జిల్లాపై తుఫాన్‌ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోందని.. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. దీంతో జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు.

ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

ఈ రోజు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక బంగాళాఖాతంలోని వాతావరణ మార్పుల కారణంగా ఇటు తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. ఈ రోజులు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వరాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, కోమురంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరింనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. వర్షాల సమయంలో గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us