విచారంగాను, గర్వంగాను ఉంది.. సంతోష్ పేరెంట్స్

లడఖ్ లో చైనా-భారత్ దళాల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు చివరి సారి గత ఆదివారం తన తల్లితో ఫోన్ లో మాట్లాడారట. సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తన కుమారుడు చెప్పాడని, అయితే ఇది సెన్సిటివ్ విషయమైనందున..

విచారంగాను, గర్వంగాను ఉంది.. సంతోష్ పేరెంట్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 17, 2020 | 10:46 AM

లడఖ్ లో చైనా-భారత్ దళాల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు చివరి సారి గత ఆదివారం తన తల్లితో ఫోన్ లో మాట్లాడారట. సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తన కుమారుడు చెప్పాడని, అయితే ఇది సెన్సిటివ్ విషయమైనందున ఎక్కువగా వివరించలేనని చెప్పాడని ఆయన  తల్లి మంజుల తెలిపారు. సంతోష్ మృతి పట్ల తమకు విచారంగాను, దేశంకోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా కూడా ఉందని ఆయన తండ్రి ఉపేందర్ చెప్పారు. నా కుమారుడు ఆర్మీలో చేరాలని నేను కోరుకున్నాను.. నేను కూడా చేరాలని ఒకప్పుడు అనుకున్నా చేరలేకపోయాను అని ఆయన అన్నారు. 2004 లో సైన్యంలో చేరిన సంతోష్ కి మొదట జమ్మూ కాశ్మీర్ లో పోస్టింగ్ లభించింది. సూర్యాపేటకు చెందిన ఆయనను హైదరాబాద్ కి బదిలీ చేయాల్సి ఉందని, అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జాప్యం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఢిల్లీలో ఉన్నారు. మంజుల, ఉపేందర్ దంపతులకు సంతోష్ ఒక్కడే కుమారుడు.

చైనా దళాలతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది భారత సైనికుల్లో కల్నల్ సంతోష్ తో బాటు తమిళనాడులోని రామనాథపురానికి చెందిన హవల్దార్, పళని, ఝార్ఖండ్ కి చెందిన సిపాయ్ ఓఝా ఉన్నారు. సంతోష్ 16 బీహార్ రెజిమెంట్ కమాండర్ గా వ్యవహరించారు.