CM KCR : హైదరాబాద్లో ఉన్న వాళ్లు ఈర్ష్య పడేలా వరంగల్‌లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీ, విద్యా వ్యవస్థ తీసుకువస్తాం : కేసీఆర్

నిన్నటి నుంచి జిల్లాల పర్యటనలు షురూ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం సేపటి క్రితం వరంగల్‌ చేరుకున్నారు. హెలికాఫ్టర్ లో వరంగల్ చేరుకున్న..

CM KCR : హైదరాబాద్లో ఉన్న వాళ్లు ఈర్ష్య పడేలా వరంగల్‌లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీ, విద్యా వ్యవస్థ తీసుకువస్తాం : కేసీఆర్
Cm Kcr Tour In Warangal

Updated on: Jun 21, 2021 | 3:48 PM

CM KCR Warangal tour : నిన్నటి నుంచి జిల్లాల పర్యటనలు షురూ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం సేపటి క్రితం వరంగల్‌ చేరుకున్నారు. హెలికాఫ్టర్ లో వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఏకశిలా పార్క్‌లో జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

 

సెంట్రల్ జైల్ స్థలంలో ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిపాలనా భవనం ప్రారంభోత్సవం, అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం తదితర పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Kcr Helicopter

వరంగల్‌ పర్యటన ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

అక్కడ ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలిస్తారు. శివాలయం, రథశాల, విష్ణుపుష్కరిణి పనులను పరిశీలించనున్నారు.

పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్‌, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను పరిశీలిస్తారు. ప్రధానాలయ ప్రాకార గోపుర సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను వీక్షిస్తారు. సమీక్ష చేపట్టడంతో పాటు… ఆలయ విస్తరణ చివరి దశకు చేరిన దృష్ట్యా తుది మెరుగులు దిద్దే పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ‌స్‌కు చేరుకుంటారు.

Read also : VH : ‘మా బాధ ఎవరికి చెప్పుకోవాల్నో అర్థం కావడం లేదు’ : ప్రెస్ మీట్ లో వి హనుమంతరావు ఆవేదన

 

Loading...
Unable to load recommendations.
Follow Us