ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్!

మార్కెట్‌లో ఎక్కడైనా పాత యమహా ఆర్ఎక్స్, రాజదూత్, జావా లేదా బుల్లెట్ కనిపిస్తే వాటి ధర తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతోంది. బైక్ పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు.. కొనుక్కొని తమ అభిరుచికి తగ్గట్టుగా మాడిఫై చేయించుకుంటున్నారు.కొన్ని సందర్భాల్లో కొత్త బైక్ ధర కంటే ఎక్కువ పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు

ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్!
Bike

Updated on: Nov 22, 2026 | 9:46 PM

ఒకప్పుడు రోడ్లపై కనిపిస్తే చాలు.. అందరి చూపూ వాటిపైనే ఉండేది. బుల్లెట్ సౌండ్, యమహా ఆర్ఎక్స్ స్పీడ్, రాజదూత్ రాయల్ లుక్.. ఆ బైక్‌లకు ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవల్. కాలం మారింది.. కొత్త మోడళ్లు, అత్యాధునిక ఫీచర్లతో ఎన్నో బైక్‌లు మార్కెట్లోకి వచ్చాయి. అయినా పాత మోడళ్లపై క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు కొత్త తరం యువత కూడా ఆ వింటేజ్ లుక్‌కు ఫిదా అవుతోంది. పాత బైక్‌లను సొంతం చేసుకోవడం స్టేటస్ సింబల్‌గా మారుతోంది.

మార్కెట్‌లో ఎక్కడైనా పాత యమహా ఆర్ఎక్స్, రాజదూత్, జావా లేదా బుల్లెట్ కనిపిస్తే వాటి ధర తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతోంది. బైక్ పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు.. కొనుక్కొని తమ అభిరుచికి తగ్గట్టుగా మాడిఫై చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొత్త బైక్ ధర కంటే ఎక్కువ పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన కొందరు యువకులు వింటేజ్ బైక్‌ల కొనుగోలు, విక్రయాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు.

అయితే హైదరాబాద్‌లో ఈ పాత బైక్‌ల క్రేజ్ మరో కోణాన్ని బయటపెట్టింది. యువతలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు పాత మోడళ్ల వాహనాలనే టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పార్కింగ్‌లో ఉన్న బైక్‌లు మాయమవుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన బయటపడింది.

నగరంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు యమహా ఆర్ఎక్స్-135పై వెళ్తున్న ఇద్దరు యువకులు కనిపించారు. వారిని ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అడగడంతో ఇద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన పోలీసులు బైక్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. విచారణలో వారు చెప్పిన విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి.

పాత బైక్‌లకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఈ యువకులు ఏం చేస్తున్నారు? చోరీ చేసిన వాహనాలను ఎలా విక్రయిస్తున్నారు? వింటేజ్ బైక్‌ల వెనుక నడుస్తున్న ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us