Vegetable Prices: సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. కొత్త ధరలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో టామాట, వంకాయ ధరలు పడిపోయాయి. ఆ కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. గతంలో రూ.20 టమాట ధరలు పలకగా.. ఇప్పుడు రూ.10కి తగ్గిపోయాయి. ఇక మిగతా కూరగాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాాబాద్, విజయవాడ, గుంటూరులో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

Vegetable Prices: సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. కొత్త ధరలు ఇవే..
Healthy Vegetables

Updated on: Feb 12, 2026 | 7:34 PM

సామాన్యులకు ధరల భారం నుంచి ఊరట లభించింది. నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు పడిపోయాయి. టామాటా, వంకాయ ధరలు భారీగా తగ్గిపోగా.. పచ్చిమిర్చి ధర కాస్త పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కూరగాయల సరసమైన ధరలకే లభిస్తున్నాయి. డిసెంబర్‌లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా.. జనవరి నుంచి పతనమవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కేజీ టామాటా రూ.10కే రైతు మార్కెట్లలో లభిస్తోంది. ఇక వంకాయ ధర కూడా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు గురువారం ఎలా ఉన్నాయో చూద్దాం.

కూకట్ పల్లి రైతు బజార్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ.11గా ఉండగా.. వంకాయ రూ.23కే లభిస్తోంది. ఇక కేజీ బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.50, బజ్జి మిర్చి రూ.28 పలుకుతోంది. అలాగే కాకరకాయ రూ.38, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.35, క్యారెట్ రూ.18, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.50, చిక్కుడుకాయ రూ.28కి విక్రయిస్తున్నారు. అటు కిలో గోరుచిక్కుడు రూ.35, బీట్ రూట్ రూ.18, క్యాప్సికం రూ.45, బంగాళదుంప రూ.18, కీర రూ.23, దోసకాయ, సొరకాయ, పొట్లకాయ రూ.20కే ఇస్తున్నారు. ఇక ఉల్లిగడ్డ కేజీ రూ.20, చామగడ్డ రూ.25, చిలకడదుంప రూ.30, పండుమిర్చి రూ.80కి అమ్ముతున్నారు.

విజయవాడలో ధరలు ఇలా..

టమాట కేజీ రూ.14, వంగ రూ.20, బెండకాయ రూ.30, పచ్చిమిర్చి రూ.36, కాకరకాయ రూ.38, క్యాబేజీ రూ.16, క్యారెట్ రూ.26, దొండకాయ రూ.44, బంగాళదుంప రూ.22, ఉల్లిగడ్డ రూ.22కే లభిస్తున్నాయి. ఇక గొరుచిక్కుడు రూ.32, దోసకాయ రూ.30, సొరకాయ రూ.10, అరటికాయ రూ.7.6కి అమ్ముతున్నారు. ఇక చిక్కుళ్లు కేజీ రూ.28, బీరకాయ రూ.30, చామదుంప రూ.24, కంద రూ.38, బీట్ రూట్ రూ.24, కీరదోస రూ.44, బీన్స్ రూ.55, క్యాప్చికం రూ.65, అలసంద రూ.30, చిలకడదుంప రూ.30కి విక్రయిస్తున్నారు.

గుంటూరులో ఇలా..

గుంటూరులో కేజీ టమాట రూ.14, బెండకాయ రూ.30, పచ్చిమిర్చి రూ.38, కాకరకాయ రూ.47, బీరకాయ రూ.40, బంగాళదుంప రూ.20, ఉల్లిపాయలు రూ.24, దోసకాయ రూ.34, సొరకాయ రూ.14, బీట్ రూట్ రూ.25, క్యాప్చికం రూ.65, క్యాలీఫ్లవర్ రూ.23కి విక్రయిస్తున్నారు. ఆకుకూరలు రూ.15, నిమ్మకాయలు రూ.45 పలుకుతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో దాదాపు టమాటా, వంకాయ ధరలు తగ్గిపోయాయి. మిగతా ధరలు స్ధిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us