Basara: శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి..

|

Aug 15, 2024 | 12:36 PM

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారు దొంగలు.సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలో హుండీతో పాటు ప్రసాదం, పులిహోర కౌంటర్లలో ఉన్న నగదు దోచుకెళ్లాడు.

Basara: శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ..  హుండీ పగలగొట్టి..
Temple Theft
Follow us on

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారు దొంగలు. రాత్రి 11 గంటలకు గోపురంపై నుండి ఒక దొంగ కిందకు దిగినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలో హుండీతో పాటు ప్రసాదం, పులిహోర కౌంటర్లలో ఉన్న నగదు దోచుకెళ్లాడు. తెల్లవారుజామున ఆలయ అధికారులకు సమాచారం అందించారు ఆలయ సెక్యూరిటీ గార్డ్స్. దీంతో.. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వార్డ్‌తో ఆలయ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బాసర అంతరాలయంలో రాత్రి 10 గంటల 20 నిమిషాలకు దొంగ చొరబడి 11:40 నిమిషాలకు బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. దాదాపు గంటపాటు అంతరాలయంలో ఉన్న దొంగని అక్కడ హోమ్ గార్డ్ సిబ్బంది గమనించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఇంటెలిజెన్స్ బ్యూరో బాసర ఆలయంలో భద్రత వైఫల్యం ఉందని గతంలోనే దేవదాయ శాఖను హెచ్చరించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఆలయంలో చోరీ జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..