MLC By Election: “హలో.. నేను మీ పట్టభద్రుల ఉప ఎన్నిక అభ్యర్థిని..” హడలిపోతున్న పట్టభద్రులు..!

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఫోన్ కాల్స్ అంటేనే ఓటర్లు హడలిపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేస్తున్న ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. వినూత్న రీతిలో అభ్యర్థులు నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ మోగిందంటే చాలు, భయపడే పరిస్థితి ఏర్పడింది.

MLC By Election: హలో.. నేను మీ పట్టభద్రుల ఉప ఎన్నిక అభ్యర్థిని.. హడలిపోతున్న పట్టభద్రులు..!
Phone Canvassing
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 24, 2024 | 1:47 PM

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఫోన్ కాల్స్ అంటేనే ఓటర్లు హడలిపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేస్తున్న ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. వినూత్న రీతిలో అభ్యర్థులు నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ మోగిందంటే చాలు, భయపడే పరిస్థితి ఏర్పడింది.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతలంతా ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచార శైలితో పట్టభద్రులు హడలిపోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌ పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని బిజెపి భావిస్తోంది.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4.61 లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. అభ్యర్థులు.. వీరి ఫోన్‌ నంబర్లను సేకరించి పట్టభద్రులకు కాల్స్‌ చేస్తున్నారు అభ్యర్థులు. ప్రచార గడువు చివరి దశకు చేరుకోవడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేలా వివిధ పార్టీల అభ్యర్థులు ప్లాన్‌ చేస్తున్నారు. నేరుగా ఓటర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. అభ్యర్థులు రోజులో ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది నుంచి 12 ఫోన్‌ కాల్స్‌ వస్తుండటంతో ఫోన్ మోగిందంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. హలో.. నేను మీ పట్టభద్రుల ఉప ఎన్నిక అభ్యర్థిని.. అంటూ ఎన్నికల ప్రచారంతో ఫోన్స్ లో పట్టభద్రులను ఊదరగొడుతున్నారు.

సాధారణ ప్రచారంలో భాగంగా అభ్యర్థులు పట్టభద్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బయట హంగామా ప్రచారాలు లేకున్నా సెల్‌ఫోన్లతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా కొందరు రికార్డింగ్‌ కాల్స్‌ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువమంది ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు ఈ తరహ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు రకాలుగా ప్రచార కాల్స్‌ చేస్తున్నారు. తమ పనుల్లో నిమగ్నమైన సమయాల్లో ఈ ఫోన్ కాల్స్ ఓటర్లను విసిగిస్తున్నాయి. కొన్ని కాల్స్ నిమిషం నిడివి ఉన్నవి కాగా, మారికొన్ని 30-40 సెకండ్ల నిడివి గల రికార్డెడ్‌ కాల్స్‌ చేస్తున్నారు.

ఇక కొందరు అభ్యర్థులైతే నేరుగా కాన్ఫరెన్స్‌ కాల్స్‌ ఓటు వేయాలంటే అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమను తాము పరిచయం చేసుకుంటూ ఇతర పార్టీలను విమర్శిస్తూ 3-4 నిమిషాల రికార్డెడ్‌ కాల్స్‌ కూడా వస్తున్నాయి. అభ్యర్థులు నేరుగా తమ గొంతుతో రికార్డు చేసి ఫోన్లు చేస్తున్నారు. మరికొందరు రాష్ట్రస్థాయిలో, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు, సెలబ్రెటీలతోనూ తమకు ఓటు వేయాలని చెప్పించుకునే వీడియోలు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తం మీద ఈ ఫోన్ కాల్స్‌తో విసిగిపోతున్న పట్టభద్రులు.. పోలింగ్ జరిగే 27వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్