TG TET 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫీజు, పరీక్ష తేదీ పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం టెట్ నోటిఫికేషన్ ను విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. జూలై 22 నుంచి 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

TG TET 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫీజు, పరీక్ష తేదీ పూర్తి వివరాలు ఇవే
Tg Tet 2026 Notification

Updated on: Jul 21, 2026 | 5:15 PM

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగడం లేదా భవిష్యత్ పదోన్నతులు పొందడం కోసం టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది నిర్వహించే రెండు టెట్ పరీక్షలతో పాటు, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ప్రభుత్వ, లోకల్ బాడీ, TGREIS, సంక్షేమ నివాస పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. అయితే ఈ టెట్‌లో సాధించిన అర్హత భవిష్యత్ ప్రత్యక్ష నియామకాలు (DSC/Direct Recruitment) కోసం చెల్లదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పరీక్ష విధానం

  • పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు.
  • పేపర్-I: 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే SGTలు, LFL హెడ్‌మాస్టర్లు.
  • పేపర్-II: 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, TGTలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెడ్‌మాస్టర్లు.
  • ప్రతి పేపర్‌లో 150 మార్కులకు 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

దరఖాస్తు ఫీజు

  • జనరల్/ బీసీ అభ్యర్థులకు ఒక పేపర్ రూ.750, రెండు పేపర్లకు రూ.1,000
  • SC / ST / PwD అభ్యర్థులకు ఒక పేపర్ రూ.700, రెండు పేపర్లకు రూ.950

అర్హత మార్కులు

  • జనరల్/EWS అభ్యర్థులకు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ
  • బీసీ అభ్యర్థులకు 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ
  • SC / ST / PwD అభ్యర్థులకు 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: 2026 జులై 22
  • దరఖాస్తుల చివరి తేదీ: 2026 జులై 29
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 2026 ఆగస్టు 31 నుంచి
  • పరీక్ష తేదీలు: 2026 సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు
  • పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు
  • ఫలితాల ప్రకటన: 2026 సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య

అర్హులైన ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. సందేహాల నివృత్తి కోసం విద్యాశాఖ హెల్ప్‌డెస్క్ నంబర్లు 7093958881, 7093468882, 7032901383 సంప్రదించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us