
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యూహం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేసీఆర్. ఆ తర్వాత కేటీఆర్ అండ్ హరీశ్‌రావు. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఈ ముగ్గురే బీఆర్ఎస్ రాజకీయాల్లో కీ ఐకాన్స్. అలాంటి ముగ్గురు నేతల నియోజకవర్గాలనే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా టార్గెట్ చేస్తున్నారు. మొదట కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు వెళ్లారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో సభ పెట్టారు. ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌పై రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతోంది. ఒకవేళ ఈ ముగ్గురు నాయకులను వారి సొంత నియోజకవర్గాల్లోనే రాజకీయంగా ఇబ్బంది పెట్టగలిగితే.. దాని ప్రభావం కేవలం ఆ మూడు స్థానాలకే పరిమితం కాకపోవచ్చు. పార్టీ మొత్తం మీద పడొచ్చు. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన ఈ ముగ్గురు నాయకులు.. తమ నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ దూకుడును ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు.. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు మరింత ఈజీగా మారతాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పుడే ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పోరాటాన్ని మొదలుపెడితే.. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ఒత్తిడి పెంచినట్టవుతుంది. అందుకేనా.. ఈ మూడు నియోజకవర్గాలను ఇంత గట్టిగా టార్గెట్ చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి? అంటే.. ఇక్కడ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమేనా? లేక ప్రత్యర్థి నాయకుల మెజారిటీని తగ్గించడమా? వీలైతే ఈ ముగ్గురినీ...