Telangana: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌ నుంచే హాల్‌టికెట్స్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామ్స్-2026 షెడ్యూల్‌ను తో పాటు హాల్ టికెట్ సమాచారాన్ని అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి టెన్త్‌ క్లాస్ విద్యార్థులకు హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి వాటిని ఈజీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Telangana: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌ నుంచే హాల్‌టికెట్స్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
Telangana Ssc Hall Tickets 2026

Edited By:

Updated on: Mar 05, 2026 | 11:23 AM

తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాటు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ నెల 14, 2026 నుంచి ఏప్రిల్ 16, 2026 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు), సైన్స్ పేపర్లకు మాత్రం సమయ వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఇలా:

అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాట్ టికెన్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విద్యార్థుల హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత పాఠశాలలకు పంపడం జరిగింది. అయితే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుండి కూడా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు www.bse.telangana.gov.in సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే టెన్త్‌ క్లాస్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌లో హాల్‌ టికెట్స్

అయితే ఈసారి వినూత్నంగా వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే సదుపాయాన్ని కల్పించారు అధికారులు. 8096958096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, ఆపై “SSC Hall Ticket March-2026” అని టైప్ చేయడం ద్వారా మీరు నేరుగా మీ మొబైల్‌లోనే హాల్ టికెట్ పొందవచ్చు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలు ఎదురైనా సంప్రదించడానికి హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 040-23230942 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు అవసరమైన సామాగ్రిని వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ పి.వి. శ్రీహరి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us