Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు కూడా పంపిణీ.. అమలుకు రెడీ..

మీకు రేషన్ కార్డు ఉందా..? అయితే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందనుంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుండగా.. నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు. సామాన్యులకు సబ్సిడీ ధరలపై వీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు కూడా పంపిణీ.. అమలుకు రెడీ..
Ration Card

Updated on: Oct 20, 2026 | 6:03 PM

రేషన్ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యంను ఉచితంగా పంపిణీ చేస్తోంది. దాదాపు రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబలు రేషన్ కార్డు కలిగి ఉన్నాయి. దీంతో ప్రతీ నెలా 3.20 కోట్ల మందికి 2.16 లక్షల టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రతీ నెలా 6 కిలోల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఎల్‌నివో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. గతంలో 26 కిలోల బస్తా రూ.1800కే లభించగా.. ఇప్పుడు రూ.2200 వరకు చేరుకుంది. ఇక కిలో బియ్యం రూ.70 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో సన్న వడ్ల సాగు తగ్గడంతో.. ధరలపై ప్రభావం పడుతోంది. త్వరలో సెంచరీ దాటే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండటంతో సామాన్యులకు ఊరట కలగుతోంది. అయితే రేషన్ కార్డు ఉన్నవారికి త్వరలో నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

రేషన్ కార్డు ఉన్నవారికి ఊరట..

ఎల్‌నివో ఎఫెక్ట్ వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఎక్కకువ భారం పడుతోంది. కిరాణా సరుకులు, కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఇంటి బడ్జెట్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించేందుకు రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమలు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, అట్టా వంటి కిరణా సరుకులను సబ్సిడీ ధరలపై పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం 2013లో అమలు చేసిన అమ్మహస్తం తరహాలో సబ్సిడీ రేషన్ పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎల్‌నివో పరిస్థితుల క్రమంలో పేదలను ఆదుకునేందుకు ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. నిత్యావసర సరుకులను తక్కువ ధరకే పంపిణీ చేయడం వల్ల సామాన్యులకు ధరల భారం తగ్గుతుంది. దీని వల్ల వారికి ఆర్ధిక భారం అనేది తగ్గుతుందని అనుకుంటోంది. ఎల్‌నివో ప్రభావం తెలంగాణపై ఎక్కువ పడుతోంది. వర్షాలు లేకపోవడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు.

వచ్చే ఏడాది వరకు ప్రభావం

ఎల్‌నివో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో వర్షాలు లేకపోవడం వల్ల కరువు పరిస్థితులు ఎదురుకానున్నాయి. దీనిన ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసింది. నీటి పొదుపు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఎల్‌నివో పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేట్టాల్సిన కార్యాచరణపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు సూచనలు, సలహాలు అందించింది,

Loading...
Unable to load recommendations.
Follow Us