Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అక్కడ దరఖాస్తు చేస్కుంటే వెంటనే పెన్షన్..

చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్తను కోల్పోయిన మహిళలకు వెంటనే పించన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలో సెర్ప్ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో పించన్ల పంపిణీలలో వేగం పెరగనుంది.

Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అక్కడ దరఖాస్తు చేస్కుంటే వెంటనే పెన్షన్..
Telangana

Updated on: Oct 31, 2026 | 7:31 AM

తెలంగాణలో పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. చేయూత పించన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పించన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక నుంచి గీత, చేనేత, డయాలసిస్, హెచ్ఐవీ, ఫైలేరియా కేటగిరీ కింద పించన్లు అందుకుంటున్నవారిలో భర్త మరణిస్తే జీవిత భాగస్వామికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గీత, చేనేత కేటగిరీ పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయిన క్రమంలో మహిళలు అర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో అలాంటివారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

తక్షణమే పించన్ మంజూరు

భర్తను కోల్పోయిన మహిళలకు అండగా నిలిచేందుకు తక్షణమే పించన్ మంజూరు చేయనున్నట్లు సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌ స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వృద్దాప్య పించన్లకు సంబంధించి భర్త చనిపోతే భార్యకు వెంటనే మంజూరు చేసేవారు. కానీ చేనేత, గీత, దివ్యాంగ, ఫైలేరియా, హెచ్ఐవీ, డయాలసిస్, కేటగిరీల్లో ఉండేవారికి ఆ విధానం ఉండేది కాదు. ఇప్పుడు ఈ కేటగిరీ వారికి కూడా అమలు చేయనున్నారు. ఈ కేటగిరీ కింద పింఛనుదారుడు మరణించినప్పుడు భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు కేటగిరీ కింద పింఛను మంజూరు చేస్తారు. ఇక 57 సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉంటే వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు పించన్ కోసం పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు బిల్ కలెక్టర్‌ దగ్గర అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి

ఏయే డాక్యుమెంట్స్ అవసరం..

ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, డెట్ సర్టిఫికేట్ సమర్పించాలి.  చేయూత పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి అర్హత ధ్రువీకరించుకున్న తర్వాత పెన్షన్‌ మంజూరు చేయనున్నారు.  చేయూత పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పెన్షన్‌ మంజూరు చేయనున్నారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అన్ని అర్హతలు  ఉంటే వెంటనే పించన్ మంజూరు చేస్తారు. దీనివారి భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్దిక రక్షణ ఏర్పడనుంది. అటు ఇటీవల పలు కేటగిరీలకు సంబంధించి కొత్త దరఖాస్తులు స్వీకరించగా.. త్వరలో పెన్షన్లను మంజూరు చేసే అవకాశముంది.

Loading...
Unable to load recommendations.
Follow Us