Minister KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..

కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపించుకున్నానని.. రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

Minister KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..

Updated on: Aug 30, 2022 | 5:41 PM

Minister KTR tests COVID-19 positive: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరోసారి కరోనావైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ స్వయంగా ట్వీట్‌ చేసి వెల్లడించారు. కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపించుకున్నానని.. రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కే. తారక రామారావు ట్విట్‌లో పేర్కొన్నారు. కరోనా ఇంక అంతం కాలేదని.. అది మన వెనుకే ఉందంటూ మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us