Harish Rao: పదవులు ఉండొచ్చు, పోవచ్చు మీ ప్రేమ వెలకట్టలేనిది.. భావోద్వేగానికి గురైన హరీష్‌ రావు.

|

Apr 09, 2023 | 4:10 PM

తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేననిపిస్తోందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్న మంత్రి హరీష్‌ రావు..

Harish Rao: పదవులు ఉండొచ్చు, పోవచ్చు మీ ప్రేమ వెలకట్టలేనిది.. భావోద్వేగానికి గురైన హరీష్‌ రావు.
Harish Rao
Follow us on

తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి భావోద్వేగ ప్రసంగం చేశారు. రాఘవపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్‌ రావు ఎమోషనల్‌ అయ్యారు. ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేననిపిస్తోందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్న మంత్రి హరీష్‌ రావు.. పదవులు ఉండొచ్చు, పోవచ్చు కానీ ప్రజల ప్రేమ వెలకట్టలేనిది అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తోందన్న మంత్రి.. మాటల్లో చెప్పలేకపోతున్నాని, కళ్లలో నీళ్లొస్తున్నాయి భావోద్వేగానికి గురయ్యారు.

మోదీకి కౌంటర్‌..

ఇదిలా ఉంటే నరేంద్ర మోదీపై మరోసారి ధ్వజమెత్తారు హరీష్‌ రావు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో మోదీ చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణపై మోదీ బురదజల్లారంటూ విమర్శించారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ,– మెడికల్‌ కాలేజీలు, జాతీయ ప్రాజెక్టులు ఇవ్వనిది మోదీయే అన్నారు. రాష్ట్రానికి సహకరించకుండా ప్రధాని ఇబ్బంది పెడుతున్నారని, మోటార్లకి మీటర్లు పెట్టం అంటే రూ.30వేల కోట్లు ఆపేశారని హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..